Perni Nani Comments: చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభపై వైయస్సార్సీపీ రియాక్ట్ అయ్యింది. ప్రధాని మోదీ సీఎం జగన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ తరఫున మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రెస్మీట్లో మాట్లాడారు. తాడేపల్లి వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ సాయంత్రం మాట్లాడుతూ.. సభపై, చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ నాయకత్వంలో నాలుగు సిద్ధం సభలు విజయవంతం అయ్యాయని పేర్ని నాని (Perni Nani Comments) తెలిపారు. నాలుగు సిద్ధం సభల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారన్నారు. మూడు పార్టీల చిలకలూరిపేట సభ వెలవెలబోయిందంటూ ఎద్దేవా చేశారు. 2019లో పాచిపోయిన లడ్లు చిలకలూరిపేట సభకు తాజాగా ఎలా అనిపించాయంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పేర్ని నాని సెటైర్లు వేశారు.
మూడు పార్టీల సభలో క్షమించాలంటూ బాబు వేడుకున్నారన్నారు. విమర్శించిన నోటితోనే ప్రధానిని బాబు పొగుడుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఎన్టీఆర్ చెప్పారన్న విషయాన్ని పేర్నొ నాని మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబుకు ఓటుకు వేయద్దని మీ బంధువులందరూ చెప్పారని తెలిపారు. సభ జరుపుకోవడం చేతగాని మీరు సీఎం జగన్ మీద యుద్ధం చేస్తారా ? అని ప్రశ్నించారు.
పోలవరం చంద్రబాబు ఏటీఎం అని గతంలో ప్రధాని విమర్శించారని, ఏ గంగాజలంతో చంద్రబాబు పాపాలను కడిగారంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు. పోలవరం పై విచారణ ఏమైంది ? పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదు ? ఈ రాష్ట్రానికి ఏం కావాలో సభలో ప్రధానిని ఎందుకు అడగలేదు ? అని ప్రశ్నించారు. మళ్లీ మాయమాటలు చెప్తున్నారని తెలిపారు.
ఒక్క పోర్టుకు కూడా కేంద్రం సాయం చేయలేదని పేర్ని నాని విమర్శించారు. ఎండమావులు లాంటి కొత్త హామీలు ప్రధాని ఇస్తున్నారని, ఇది ప్రజలు గమనించాలన్నారు. ప్రక్కనున్న వారు గజ దొంగలని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలంటూ చురకలంటించారు. రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, వెనుక నుంచి చంద్రబాబు రాకుండా ప్రధాని మోదీ చూసుకోవాలంటూ సూచించారు.
చంద్రబాబు గజదొంగ అని ఎన్టీఆర్ చెప్పారని, ఎన్టీఆర్ పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదని పేర్ని నాని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారని కొత్తగా ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసింది? అని నిలదీశారు. సీఎం జగన్ పాలనలో ఏంతో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. మహిళా సాధికారతను సీఎం జగన్ ప్రభుత్వం చేసి చూపిందని పేర్ని నాని తెలిపారు.
ఇవీ చదవండి: CBN Comments on Modi: అబ్బబ్బ.. అవేం పొగడ్తలు.. తిట్టిన నోటితోనే ప్రధాని మోదీపై చంద్రబాబు పొగడ్తల వర్షం!!
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
AP Polling Centers: ఏపీలో పోలింగ్ కేంద్రాల పరిస్థితేంటి? ముఖేష్ కుమార్ మీనా ఏమన్నారంటే..
