HomeAndhra PradeshPM Modi in Anakapalli: ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా నడుస్తోంది: అనకాపల్లిలో ప్రధాని మోదీ

PM Modi in Anakapalli: ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా నడుస్తోంది: అనకాపల్లిలో ప్రధాని మోదీ

PM Modi in Anakapalli: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అనకాపల్లిలో పర్యటించారు. కూటమి తరఫున ప్రచారంలో భాగంగా ఆయన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిమయం అంటూ విమర్శలు చేశారు. అనకాలపల్లి బహిరంగ సభలో ప్రధాని ఏమన్నారంటే…

“అనకాపల్లి నూకాలమ్మ తల్లికి ప్రణామాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పిస్తున్నా. అనకాపల్లి బెల్లం లాగా తెలుగు భాష తీయనైనది. కేంద్రంలోనూ మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది.

ప్రపంచంలో భారత్ కు గౌరవం పెరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ యువత కోసం పనిచేస్తుంది. ఏపీలో కేంద్రం అనేక పనులు చేస్తోంది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది. బీజేపీ మంత్రం అభివృద్ధి అయితే వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రం అవినీతి. విశాఖ రైల్వే జోన్ కోసం వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు.

అభివృద్ధి పనులకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. కేంద్రం ఏపీకి 21 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సగం ఇళ్ళు కూడా పేదలకు ఇవ్వలేదు. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. జగన్ పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నారు. రైతుల గురించి జగన్ పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను జగన్ పూర్తి చేయడం లేదు.

రైతులు చెరకు పంట పండించడం మానుకుంటున్నారు. ఇక్కడ చాలా చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయి. చెరకు రైతుల జీవితాల్లో ఆనందం తెస్తాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో చెరకు రైతులకు మేలు. ఏపీ సంస్కృతికి కాంగ్రెస్, వైయస్సార్‌ కాంగ్రెస్‌ నష్టం చేశాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఏపీ సంస్కృతి పై దాడులను అరికడతాం. వైయస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్ రెండూ ఒకటే. మత్స్యకారులకు బీమా అందిస్తాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ. ఏపీలో ల్యాండ్, శాండ్ మాఫియా నడుస్తోంది. అని ప్రధాని మోదీ విమర్శించారు.

ఇవీ చదవండి: PM Modi in Vemagiri: చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నంబర్‌ వన్: ప్రధాని మోదీ
Perni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్‌ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
CBN Comments on Modi: అబ్బబ్బ.. అవేం పొగడ్తలు.. తిట్టిన నోటితోనే ప్రధాని మోదీపై చంద్రబాబు పొగడ్తల వర్షం!!
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు