Perni Nani: చంద్రబాబు దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నాడని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లు.. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఆడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన భూమి మ్యూటేషన్ జరగలేదని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ప్రచారం చేస్తున్నారన్నారు.
పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారు.. కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా భూమి లీజుకిచ్చారన్నారు. 70 ఎరనాల పొలాన్ని 25 ఏళ్ల క్రితమే చెరువు చేశారన్నారు. పీవీ రమేష్ ఏడాదిక్రితం మ్యూటేషన్ కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రైతు నాగేంద్రకు, పీవీ రమేష్ కు సరిహద్దు వివాదం ఉందని పేర్ని నాని తెలిపారు. జనవరిలో కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో విచారణ జరిగిందని గుర్తు చేశారు.
పీవీ రమేష్ తన గుమస్తాతో ఒరిజనల్స్ కాకుండా జిరాక్స్ పంపించారని పేర్ని నాని తెలిపారు. 70 ఎకరాల చెరువులో పీవీ రమేష్ పొలం ఎంతో తెలియదన్నారు. చెరువు సరిహద్దులు ఫిక్స్ చేస్తే ఆయన భూమి ఎంతో తేలుతుందని స్పష్టత ఇచ్చారు. పోలింగ్ అయ్యాక సర్వే చేస్తారు.. పీవీ రమేష్ విన్నకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబుకు తాను చేసిన మంచి చెప్పే దమ్ము లేదని పేర్ని నాని అన్నారు. మాజీ అధికారులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పీవీ రమేష్ ఇంత దిగజారి ప్రవర్తించాలా? అని ప్రశ్నించారు. పీవీ రమేష్ పొలం వివాదంలో ఉందన్నారు. స్థానిక రైతులతో పీవీ రమేష్ కు వివాదాలు ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు, పీవీ భూమికి సంబంధం ఏంటి? అని నిలదీశారు. విన్నకోట వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పారు. భూపత్రాలు తెమ్మంటే పీవీ రమేష్ రాలేదని పేర్ని నాని చెప్పారు.
ఇవీ చదవండి: Perni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు
Perni Nani: పదేళ్లయినా నా కోసం బతుకుదామనే ఆలోచనతో పోటీ చేయడం లేదు: పేర్ని నాని
Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
