HomeAndhra PradeshYSRCP Manifesto: వైయస్సార్‌ సీపీమేనిఫెస్టో రిలీజ్.. సీఎం జగన్‌ కామెంట్స్‌ ఇవీ..

YSRCP Manifesto: వైయస్సార్‌ సీపీమేనిఫెస్టో రిలీజ్.. సీఎం జగన్‌ కామెంట్స్‌ ఇవీ..

YSRCP Manifesto: వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీమేనిఫెస్టోను సీఎం జగన్‌ ఇవాళ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

“మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడు వచ్చింది అంటే.. ఈ ఐదేళ్లలో ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. గతంలో మేనిఫెస్టోని అందరూ చెప్పేవాళ్లు.. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి, ఒక డాక్యుమెంట్‌ని చూపించేవాళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్‌ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా ఎక్కడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్‌ ఎక్కడ దొరుకుతుంది అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వాన్నమైన పరిస్థితిని మనమంతా చూశాం.

కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను, ఒక బైబిల్‌ గా…. ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ.. దీన్ని ఇంప్లిమెంట్‌ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్‌ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలల అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

ఇది 2019 నాటి మన మేనిఫెస్టో. 2019 లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది మనం అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉంది. అన్నిసార్లు ఈ మేనిఫెస్టోని ఇళ్లకు పంపించాం. ప్రతి సంవత్సరం తరువాత ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ… ఇదిగో మా మేనిఫెస్టో.. ఇదిగో ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. చెప్పినవన్నీ మీరే టిక్‌ చేయండి అని అడిగాము. మొట్టమొదటి సంవత్సరంలో ఏ 85 శాతమో 86 శాతమో లేక 88శాతమో టిక్‌ చేస్తే, చివరి ఏడాదికి వచ్చేసరికి 99శాతం పైచిలుకు మేనిఫెస్టోను అమలు చేసి మనం ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి.

ఇలా మేనిఫెస్టోను పూర్తి చేసి ప్రతి ఇంట్లో చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అంటే అది ఈ 58 నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడుతున్నాను. నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలోనే, రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు, డీబీటీగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్లాయి. అవి నేరుగా వారి చేతికే అందడం. ఇదొక హిస్టరీ. రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నాకు చెల్లెమ్మలకు దేవుడి దయతో, మంచి చేయగలిగాము. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వ తాతల ఆత్మాభిమానాన్ని ఎరిగినవాడిగా, వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్‌ డెలివరీ చేసిన పరిస్థితి కూడా 58 నెలల కాలంలోనే.

2019లో మన మేనిఫెస్టో రిలీజ్‌ చేసేటప్పుడు కూడా చాలామంది మనవాళ్లలో కూడా నాతో అన్నారు సాధ్యమేనా అని? ఎందుకంటే 2019లో మనం చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత 58 నెలల్లో మనం ఏవైతే అమలు చేసామో గతంలో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఈ మాదిరిగా స్కీములు రావడం గానీ, ఈ మాదిరిగా బటన్‌ నొక్కడం గానీ, ముందుగానే క్యాలెండర్లో ఈ నెలలో ఏ స్కీమ్‌ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీము కరెక్ట్‌ గా అందేలా చేయడం గానీ ఇవన్నీ గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి.

2014లో నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరితమైన హామీలు ఇస్తూ ఉన్నారు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా… మన సంగతి మనం చూసుకుందాం ముందైతే హామీలు ఇచ్చేద్దాం… అని కూడా నా శ్రేయోభిలాషులే సలహాలు ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలేదు. ఆరోజు కూడా నేను చేయగలిగేవి మాత్రమే చెప్పాను. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నాను.

నాకు 2014లో అధికారం రాలేకపోయినప్పటికీ చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగేవి మాత్రమే చెప్పి, చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళుతున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మధ్య తేడా గమనించండి.

రాజకీయాల్లో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే.. ఆ మాట ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అని ఆశతో ఓటు వేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు, ప్రజల ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి? వాళ్ల నమ్మకంతో ఆడుకోవడమా? వారి మనోభావాలతో ఆడుకోవడంమా? వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ, వారిని చేయి పట్టుకుని నడిపించగలగడమే లీడర్‌షిప్‌ అంటారు.

ఈరోజు పేదవాళ్ల పరిస్థితి… ఏమిటి? ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు,,, అద్భుతంగా ఉన్నారు… గతంలో ఎలా బతికారు అన్నది 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశాను. వాళ్ల దగ్గరకు పోయి నేను చూసినప్పుడు పేదవాళ్ల పరిస్థితి ఏంటి అని గమనిస్తే … చదివించాలని ఆరాటం ఉన్న పిల్లలను చదివించలేని పరిస్థితి తల్లులది. మొట్టమొదట కడుపు నిండితే తప్పించి, తర్వాతనే చదువులు గుర్తుకు వస్తాయి, అలాంటి పరిస్థితి నుంచి … ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి, తల్లితండ్రులు ఫీజులు కట్టలేక పోవడంతో ఇది చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇవన్నీ నా కళ్లారా చూసాను. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్‌ రాని పరిస్థితి. ఇల్లు ఇవ్వని పరిస్థితి.

రేషన్‌ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా, సబ్సిడీ మీద లోన్లు రావాలన్న, ఇచ్చే ఆరకొర వాటికి కూడా లంచం లంచం లంచం. వివక్ష వివక్ష. ఈ మ్యాన్‌ మేడ్‌ ప్రాబ్లమ్స్‌ ను, రాజకీయ నాయకులు సృష్టించిన సమస్యలను, రాజకీయ పార్టీలు సృష్టించిన సమస్యలను, ఈ వ్యవస్థల వల్ల పేదవాడి బ్రతుకు ఎలా అతలాకుతలం అయిందో నా కళ్ళారా చూశాను.

2019 లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఈరోజు వరకు, ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్‌ వెతుకుతూ, ఆ సొల్యూషన్‌ ను మేనిఫెస్టోలో పెట్టి, ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ 58 నెలల పాలన సాగింది.

కోవిడ్‌ లాంటి మహమ్మారి వల్ల రెండు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయినా, రావలసిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగినా, సాకులు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్‌ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు. సాకులు చూపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎక్కడా సాకులు చూపకుండా.. చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం అండగా ఉన్నాం.

మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్‌ చేస్తూ, ఆ ఇంప్లిమెంట్‌ చేసిన మేనిఫెస్టోని ప్రజల వద్దకు పంపిస్తున్నాం. వేగంగా అడుగులు వేస్తూ, మనం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆగస్టులో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. అక్టోబర్‌ రెండో తారీకు కల్లా.. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా… ప్రతి పథకము బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతికి, వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావడం. ఎవరైనా మిస్‌ అయిపోయినా కూడా, వారిని జల్లెడ పట్టి వెతికి, పథకాలు ఏమైనా మిస్‌ అయితే వారికి మరో అవకాశం కల్పించడం.

భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్లుగా, మొట్టమొదటిసారిగా ప్రజలకు మంచి చేయడమే కాకుండా, ప్రతి సంవత్సరం మేనిఫెస్టోను పంపించడమే కాకుండా, ఎమ్మెల్యేలను కూడా, ఎప్పుడో ఎన్నికల అప్పుడు గడపగడపకు వెళ్లడం కాకుండా , ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరకు ముందుగానే గడపగడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని, ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తికి రాసిన లెటర్‌ ని తీసుకువెళ్లి, స్వయంగా వారికే ఇచ్చి, అక్క చెల్లి, ఇచ్చిన హామీలన్నీ జరిగాయి కదా, సంతోషంగా ఉన్నారా అని ఎమ్మెల్యేలు సైతం వారి దగ్గరకు వెళ్లి, వారి ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండలేదు. కానీ మన పాలల్లో ఈ 58 నెలల కాలంలో అది జరిగింది.” అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: YSRCP Manifesto 2024: దటీజ్‌ జగన్ గట్స్‌.. మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ప్రజాకర్షక హామీ లేదు!
YS Jagan Election Campaign: 28వ తేదీ నుంచి రోజూ మూడు ప్రాంతాల్లో జగన్‌ సభలు
YS Jagan in Pulivendula: బంధువులకు దోచిపెట్టడానికి సీఎం కాలేదు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
YS Jagan in Vizianagaram: డ్రీమ్స్‌ మీవి, స్కీమ్స్‌ మీ జగన్‌వి.. విజయనగరం సభలో సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు