HomeAndhra PradeshYSRCP Manifesto 2024: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో...

YSRCP Manifesto 2024: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదలలో జగన్‌

YSRCP Manifesto 2024: తనకు చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, అలవిగాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం రావని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. చంద్రబాబుహయాంలో ఏం జరిగింది? తన హయాంలో ఏం జరిగిందని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సీఎం జగన్.

“అధికారంలోకి వచ్చి పార్టీ హామీలు అమలుచేయకపోతే పేదల బ్రతులు చిన్నాభిన్నం అవుతాయి. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే… మేనిఫెస్టో అన్న దానికి అంత పవిత్రత ఎందుకు ఉండాలి అంటే.. ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారంలోకి ఆ పార్టీ, అధికారంలోకి వచ్చిన వాళ్లు చేయకపోతే, పేదల బతుకులు ఎలా చిన్నాభిన్నం అవుతాయి అనేదానికి ఉదాహరణ మనకన్నా ముందు పరిపాలించిన ప్రభుత్వం.

అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, అప్పట్లో మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు? వాళ్లు మేనిఫెస్టోలో చెప్పినవి ఏవి చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ విధంగా చిన్నాభిన్నమయ్యాయి? అనేది ఒకసారి గమనించాలి.

2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి.. ముగ్గురి ఫోటోలతో, కింద చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన అంశాలు అంటూ 2014 ఎన్నికల్లో ఒక పాంప్లెట్‌ ను ప్రతి ఇంటికి పంపించారు. ప్రతీతికి పంపించిన ఈ పాంప్లెట్‌ ని చూసి, టీవీలలో వీరిచ్చిన అడ్వటైజ్మెంట్లను చూసి, అప్పట్లో ఈనాడులో చూసినా, ఆంధ్రజ్యోతిలో చూసినా, ఏబీఎన్‌ లో చూసినా, టీవీ 5 లో చూసినా అడ్వర్డైజ్‌మెంట్‌ ఊదరగొట్టేవారు.

ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒకరు లాగేస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది… అది అడ్వర్డైజ్‌మెంట్‌. ముఖ్యమైన హామీలు అంటూ, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి, ఇదే కూటముగా 2014లో ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి ఓటు వేసినందుకు ప్రజల బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయి అనే విషయాన్ని నాగరిక ప్రపంచంలో ప్రజలు గుర్తించాలి. ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు.

ఓట్లు వేసిన తర్వాత అవి అమలు కాకపోతే ప్రజలు బ్రతుకులు ఏమవుతాయని కనీసం ఆలోచన కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలుపెడితే… ఎలా ఉంటాయి? రైతుల రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తాను అన్నారు. రూ. 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనే ఈ ప్రశ్నను నేను అడుగుతున్నాను. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం అన్నారు. రూ. 14205 కోట్లు .. పొదుపు సంఘాలకు మాఫీ చేస్తానని చెప్పిన సొమ్ము. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?

ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25 వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తాం అన్నారు. రూ. 25వేల కథ దేవుడు ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశారా? ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అన్నట్టుగానే ఆరోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ వారు చెప్పిన మాటలు ఇవన్నీ.

ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకి రూ. 2000 పెన్షన్‌ అన్నారు. ఐదు సంవత్సరాలు, అంటే 60 నెలలు, నెలకు రూ. 2000 చొప్పున లక్ష ఇరవై వేల రూపాయలు… ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్లు స్ధలం, పక్కా ఇల్లు అన్నారు. మూడు సెంట్లు కాదు కనీసం ఒక్క సెంటు స్థలం అన్న ఎవరికైనా ఇచ్చారా? నేను చదివే ప్రతి అంశం చంద్రబాబు సంతకం పెట్టి, ముగ్గురు ఫోటోలు పెట్టి, ఇంటింటికీ పంపించిన ఈ పాంప్లెట్‌లో నుంచి ముఖ్యమమైన హామీలు అంటూ వీళ్లు రాసినవే నేను చదువుతున్నాను.

పదివేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అన్నారు. చేనేత పవర్‌ లూమ్‌ రుణాల మాఫీ అన్నారు. అయ్యాయా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా? సింగపూర్‌ కు మించి అభివృద్ధి అన్నారు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తా అన్నారు. ప్రతి నగరంలో నిర్మిస్తామన్నారు. తాడేపల్లి సంగతి దేవుడెరుగు. విజయవాడలో కనిపించడం లేదు.

ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అంటూ మీరు చెప్పిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా ? ప్రత్యేక హోదా అయిన తెచ్చారా? దాన్నీ అమ్మేశారు? అదే నోటితో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అని చెప్పి మళ్లీ వెటకారం కూడా చేశారు. నేను చెప్పొదొక్కటే. రాజకీయ నాయకుడు విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్ధంలేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం? ఎవరికోసం చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి ఇంటిలో, ప్రతిపేదవాడి గుండెల్లో మన ఫోటో ఉండాలన్న తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి. రూ.87,612 కోట్ల రుణాలు మాపీ చేస్తానని చెప్పిన పెద్దమనిషి.. రుణాల మాఫీ మాట దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారు విడిపిస్తానన్న మాట దేవుడెరుగు… అంతవరకు అందుతున్న సున్నావడ్డీ రుణాలను కూడా రైతులకు లేకుండా ఎగ్గొట్టారు.

పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాపీ చేస్తామన్న మాటలు దేవుడెరుగు, అక్టోబరు 2016 వరకు అందుతున్న సున్నావడ్డీని సైతం రద్దు చేశారు. పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటంటే.. ఓవర్‌ డ్యూస్, ఏన్‌పీఏలు 18శాతానికి వెళ్లిపోయింది. ఏ గ్రేడ్, బి గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌గా మారిపోయాయి. అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలన్నీ రోడ్డున పడ్డాయి. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి అన్నారు. ఎవరికి ఇచ్చారు? 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే.

అదే మనం ఈ 58 నెలల కాలంలో మనం ఏకంగా 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి సచివాలయంలో పిల్లలు కనిపిస్తారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, స్టాప్‌లు, పారామెడికల్‌ స్టాప్‌ కనిపిస్తారు. ఈ రోజు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. ఎప్పుడూ జరగని విధంగా సంస్కరణలు కూడా కనిపిస్తున్నాయి. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఈ రోజు గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెబుతున్నాయి. ఈ 58 నెలలకు ముందు ఎవరైనా మీతో కానీ, ఇంకొకరుతో కానీ గవర్నమెంటు ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అంటే ఎవరైనా నమ్మేవాళ్లా? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్లా? ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్లా? మొట్టమొదటసారిగా మార్పు చేసి చూపించాం.

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బిసీలు, నా మైనార్టీలు అని పిలుస్తూ.. సామాజిక న్యాయం ఇవాళ కనిపిస్తోంది. ఇవాళ నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలే 68 శాతం మంత్రి పదవుల్లో ఉన్నారు. 5 మంది డిప్యూటీ సీఎంలలో 4గురు నేను నా అని పిలుచుకునే నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలే ఉన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను ఈ 58 నెలల కాలంలో ఏకంగా చట్టం చేసి మరి అమలు చేశాం. మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ, 25 ఎంపీలు కలిపి ఉన్న 200 స్ధానాలకు గానూ.. ఏకంగా 50శాతం అంటే 100 స్ధానాలు నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ అంధ్రరాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా?. పోనీ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా?. సామాజిక న్యాయం అన్నదానికి అర్ధం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడే జరిగింది.

మన పల్లెటూరి పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్యసమితికి కూడా వెళ్లి రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఇవాళ మనమంతా చూస్తున్నాం. ఫస్ట్‌ క్లాస్‌లో ఐబీతో ప్రయాణం మొదలవుతుంది. గవర్నమెంటు బడుల్లో నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లిషు మీడియం ఇవాళ గవర్నమెంటు బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో పది సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి. ఒకసారి ఊహించండి. ఒకటో తరగతి పిల్లవాడు ఐబీ ఫస్ట్‌ క్లాస్‌ ఈరోజు జాయిన్‌ అవుతున్నాడు. 2035లో టెన్త్‌ క్లాస్‌లో ఐబీ ఎగ్జామ్‌ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఏంఐటీ వంటి వాటితో.. వారికి సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆన్‌లైన్‌ ద్వారా వాళ్లచేతనే సర్టిఫికేట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో జరిగింది.

2035 నాటికి ఐబీలో మన పిల్లలు పదోతరగతి సర్టిఫికేట్‌ తీసుకుంటారు. ఆ తర్వాత నాలుగైదేళ్లకు డిగ్రీ పాసవుతారు. ఆ డిగ్రీలో వారి చదివే కోర్సుల్లో కరిక్యులమ్‌ కూడా దాదాపు 30 శాతం కోర్సులు హార్వర్డ్‌ నుంచో, స్టాన్‌ఫర్డ్‌ నుంచి సర్టిఫికేట్లు వస్తాయి. ఈ 10–15 సంవత్సరాల తర్వాత ఆ క్వాలిటీ చదువులతో పిల్లవాడు బావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెడితే.. పరిస్థితి ఏమిటి? . ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడుతూ ఉద్యోగాల కోసం అఫ్లికేషన్‌ పెడితే పరిస్థితి ఏమిటి? పేదిరికం అన్నది మటుమాయం అయ్యే పరిస్థితి. విద్యారంగంలో మొదలుపెడితే కనీవినీ ఎరుగని మార్పులు వైద్యరంగంలో, వ్యవసాయరంగంలో, మహిళా సాధికారతవిషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో ఇవాళ కనిపిస్తున్నాయి.

గ్రామంలోకి అడుగుపెట్టి.. నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. సచివాలయం కనిపిస్తోంది. ఆరువందల రకాల సేవలు, ప్రతి ఆరవై, డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్, వివక్ష, కరెప్షన్‌ లేకుండా ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తున్న సేవలు. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే విలేజ్‌ క్లినిక్‌. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌. ప్రతి ఇంటికీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష. విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలు. ఆరోగ్య ఆసరా. మరో నాలుగు అడుగులు వేస్తే.. అక్కడ రైతన్నను చేయిపట్టుకుని నడిపించే రైతుభరోసా కేంద్రం కనిపిస్తుంది. అక్కడే నాణ్యమైన విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్‌ సరఫరా దగ్గర నుంచి మొదలుపెడితే పంటల కొనుగోలులో కూడా దళారులు లేని వ్యవస్ధ అక్కడే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే.. నాడు నేడుతో మార్పు చెందిన ఇంగ్లిషుమీడియం బడులు కనిపిస్తాయి.

ఇవన్నీ మరో 10–15 సంవత్సరాలు జరిగితే ఎలాంటి మార్పు వస్తుందో ఆలోచన చేయండి. ఇంతకముందు ఇదే మేనిఫెస్టో నేను చూపించాను. 2019లో మనం చూపించిన మేనిఫెస్టో ఏ రకంగా అమలు చేశామో చూపించాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ స్కీములు ఎప్పుడూ వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. 2014లో చంద్రబాబు నాయడుగారు ఏ రకంగా చేశారు. ఆయన ఇచ్చిన దొంగ హామీలనూ చూపించాం. చేయని వాటిని కూడా చూపించాం. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ అని సూపర్‌ సెవెన్‌ అని అంటున్నాడు. చంద్రబాబు చెప్పే ఈ సూపర్‌ సిక్స్‌లకు ఈ సూపర్‌ టెన్‌లకు అసలు ఎంత ఖర్చవుతుంది. ఇది సాధ్యమైనా.. మళ్లీ చంద్రబాబునాయుడు గారు 2014 మాదిరిగానే మరలా హిస్టరీ రిపీట్స్‌. మళ్లీ ఇదే సంతకం. ఇదే కూటమి. మళ్లీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజలజీవితాలతో చెలగాటం ఆడ్డమే. దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది గమనించాలి.

2019లో మనం ఎప్పూడూ చూడని విధంగా, జరగని విధంగా మనం అమలు చేసిన ఈ స్కీంలు, సంస్కరణలు, మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండూ కలిపితే డీబీటీ, నాన్‌ డీబీడీ(ఇంటే ఇళ్ల స్ధలాలు, పిల్లలకిచ్చే ట్యాబులు, విద్యాకానుక, గోరుముద్ద లాంటివన్నీ) రెండూ కలిపితే సంవత్సరానికి దాదాపు రూ.70వేల కోట్లు ఖర్చయింది. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎప్పుడూ జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే.. గతంలో ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే రూ.70వేల కోట్లు దాదాపుగా మనం ఇవ్వగలిగాం.

ఈ రోజు చంద్రబాబు చెబుతున్న సూపర్‌ సిక్స్, సూపర్‌ టెన్‌లు గమనిస్తే… రూ.1,21,619 కోట్లు అవుతుంది. వీటికి తోడు జగన్‌ చేస్తున్న కొన్ని పథకాలు ఆపడం ఎవరి చేతా కాదు. అటువంటివి కొన్ని పథకాలు ఉన్నాయి. అవి చూస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద వసతి దీవెన, విద్యాదీవెన ఆపడం ఎవరి చేతా కాదు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణం(ఆరేళ్ల లోపు పిల్లలకు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు) రేషన్‌ ఇస్తున్నాం. ఇది ఆపడం ఎవరి చేతా కాదు. ఉచిత బియ్యం ఇస్తున్నాం. కేంద్రం కొంత ఇస్తే.. మిగిలినంతా రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ పెంచి ఇస్తుంది. 18.50 లక్షల మంది రైతన్నలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. జగన్‌ చిన్నపిల్లకు గోరుముద్ద ఇస్తున్నాడు.. ఎవరికైనా ఇది చేయకతప్పదు. ఇటువంటి ఈ పథకాలకు మరో రూ.29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయకతప్పని ఖర్చు. రెండూ కలిపితే రూ.1,50,718 కోట్లు. జగన్‌ ఎంతో కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే… రూ.70వేల కోట్లు చాలా కష్టపడి చేయగలుగుతున్నాం.

మరి రూ.1.50 లక్షల కోట్లతో ఆయన సూపర్‌ సిక్స్, సూపర్‌ టెన్‌ అని అంటూ ప్రజలను అడ్డగోలుగా ప్రజలను మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి.. ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్‌గా.. హేబిట్యువల్‌ అఫెండర్‌లా.. 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికీ పంపించి ఇదే కూటమిలో ఉంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, మరలా హిస్టరీ రిఫీట్స్‌ అన్నట్టు మరలా 2024లో సాధ్యం కాని హామీలతో అబద్దానికి రెక్కలు కడుతున్నారు. రూ.1.50 లక్షల కోట్లకు సంబంధించి సాధ్యం కాని హామీలతో ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం, దొంగతనం కన్నా అన్యాయం కాదా? 420 కాదా? ఛీటింగ్‌ కాదా? ఆలోచన చేయండి. మీ మనసులకే విడిచిపెడుతున్నాను.

రాజకీయ నాయకుడుంటే ఎలా ఉండాలి. మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడాడు అన్న నమ్మకం ఉండాలి. ఏకార్యకర్త అయినా ఫలానా రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఫలానా నాయకుడు మా నాయకుడు, అదిగో అతడే మా లీడర్‌ అని కాలర్‌ ఎగరేసుకుని చెప్పాలి. కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్‌ ఎగరేసుకుని చెప్పడం మాట దేవుడెరుగు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలెక్కడైనా కనిపిస్తే.. దొడ్డిదారిని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఈయన మనం చెబుతున్న రూ.70 వేల కోట్లకు అదనంగా మరో రూ.80 వేల కోట్లు చెబుతున్నాడు. సాధ్యం కాదని తెలిసినా తాను చెబుతున్నాడు. ప్రతి సందర్బంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే… జగన్‌ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను అంటాడు. నేను సంపద సృష్టిస్తాను కాబట్టి నేను చేయగలుగుతాను అని నిస్సిగ్గుగా తన అబద్దాన్ని డిఫెండ్‌ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను, అబద్దాలను నిస్సిగ్గుగా డిఫెండ్‌ చేసుకుంటాడు.

ఈ 14 యేళ్ల తన పరిపాలనలో తాను ఏ స్ధాయిలో సంపద సృష్టించాడో చూస్తే.. ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ఫ్‌లెస్‌ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ లోటే. మరి రెవెన్యూ ఎక్స్‌పెండేచర్‌కే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు… సంపద ఎక్కడ నుంచి సృష్టించారు. గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతున్నాను బాబు. ఇది వాస్తవం. అదే చంద్రబాబు లేని పరిపాలన, చంద్రబాబు ముందు పరిపాలన గమనిస్తే… అంతా రెవెన్యూ సర్ఫ్‌లెసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిటీ అన్నది ఒక్క బాబు హయాంలోనే కనిపిస్తుంది.

చంద్రబాబు సంపద సృష్టించలేదని తెక్కలు చెబుతున్నాయి. ఇదే బాబును నేను అడుగుతున్నాను… సంపద సృష్టించింది ఎక్కడా అని? కారణం సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్ధిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్‌ ఎందుకు చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరెప్షన్‌ లేదు, వివక్ష లేదు కాబట్టి.

పోనీ అప్పులు పరిస్థితి కూడా ఒకసారిæ గమనిద్దాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడు హయాంలో అప్పులు ఎంత చేశాడు? జగన్‌ ఎంత అప్పులు చేశాడు. అప్పులు పరిస్థితిని ఒక్కసారి గమనించినట్లైతే… 2014 నుంచి 2019 వరకు కంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ చూస్తే… చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పులుంటే… 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది.

దీనికి తోడు గవర్నమెంట్‌ గ్యారంటీడ్‌ రుణం లెక్కిస్తే… బాబు రాకముందు రూ.14వేలు కోట్లు, బాబు హయాంలో రూ.59 కోట్లు, మన హయాంలో రూ.1.43 లక్షల కోట్లు పెరిగింది. అలా చూసినా రూ.6.34 లక్షల కోట్లు. అది కాక ఇంకా ముందుకు వెళ్దాం. నాన్‌ గవర్నమెంట్‌ గ్యారంటీడ్‌ డెఫ్త్‌ స్టేట్‌ పీఎస్‌యూలు కూడా తీసుకుందాం. మొత్తం పవర్‌ సెక్టార్‌ కార్పొరేషన్‌లో రుణాలు రూ.29వేల కోట్లు ఉంటే… ఆయన రూ.69 వేల కోట్లకు తీసుకుపోతే.. మనం వచ్చిన తర్వాత రూ.1.06 కోట్లు ఉంది. పే బిల్స్‌ ఆన్‌ ఎకౌంట్‌ ఆఫ్‌ పవర్‌ పర్చేజస్‌ చూస్తే.. ఆయన హయాంలో రూ.21వేల కోట్లకు ఎగబాకితే మన హయాంలో రూ.8,500 కోట్లకు తగ్గింది. నాన్‌ గ్యారంటీడ్‌ పవర్‌ లయబులిటీస్‌ అండ్‌ పేబుల్‌ కేటగిరీ –3 కలుపుకుంటే..ఆయన హయాంలో రూ.81 వేల కోట్లకు ఎగబాకితే..మన హయాంలో తగ్గి.. రూ.69వేల కోట్లకు తగ్గింది.

మొత్తం టోటల్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ లయబిలిటీస్‌ అండ్‌ నాన్‌ గ్యారెంటీ పీఎస్‌యూ లయబిలిటీస్‌ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్‌ ఉన్నాయని చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో రూ.1.53 లక్షల కోట్లు కాస్తా రూ.4,12,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది రూ.7.03 లక్షల కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్‌ రేట్‌ ఆఫ్‌ డెబిట్‌ చూస్తే ఆయన హయాంలో 21.87 శాతానికి ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13 శాతం మాత్రమే. మరి ఫైనాన్షియల్‌ డిసిప్లిన్‌ ఎవరికి ఉంది?

క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు? నేను స్కీములకు పెట్టలేదు.. నేను క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌కు పెట్టాను.. అందుకనే నేను చేయలేకపోయాను.. అని ఇంకో మాట మాట్లాడతాడు. పోనీ అక్కడా చూద్దాం క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ ఎవరి హయాంలో ఎంత జరిగింది అన్నది.

ఎవరి హయాంలో నాడు–నేడు జరిగింది? ఎవరి హయాంలో ఆస్పత్రులు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో స్కూల్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ జరిగింది? ఆయన హయాం చూస్తే క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కింద సంవత్సరానికి రూ.15,227 కోట్లు అయితే, మన హయాంలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ రూ.17,757 కోట్లు. కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. కొత్తగా 10 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నాం. కొత్తగా 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కడుతున్నాం. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇన్‌ ఫ్యాక్ట్‌ మనకు కోవిడ్‌ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ.. మోస్ట్‌ ఇంపార్టెంట్‌ పాయింట్‌ అది గుర్తు పెట్టుకోవాల్సింది అందరూ కూడా. రెండు సంవత్సరాలు కోవిడ్‌ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్‌ పర్ఫార్మెన్స్‌ ఇదీ.. చంద్రబాబు పర్ఫార్మెన్స్‌ అది.

పోనీ ఇంకొక సైడ్‌ కూడా ముందుకు పోదామా? మన షేర్‌ ఆఫ్‌ జీఎస్‌డీపీ ఇన్‌ జీడీపీ ఆఫ్‌ ద కంట్రీ. ఇది జీడీపీలో మన రాష్ట్ర షేర్‌ ఎంత? అంటే పురోగతి అనేది ఏమిటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4.47 శాతం కాంట్రిబ్యూషన్‌ ఉంటే మన హయాంలో 4.83 శాతం కాంట్రిబ్యూషన్‌. అంటే గ్రోత్‌ పెరిగి ఇంత డిఫికల్ట్‌ పీరియడ్‌ లో, కోవిడ్‌ ఉన్న సమయంలో కూడా రాష్ట్ర గ్రోత్‌ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్‌ చేస్తున్న దాంట్లో 4.83 శాతం. వర్సెస్‌ 4.47 శాతం చంద్రబాబు పాలనలో. అంటే ఎవరి హయాంలో గ్రోత్‌ ఉంది? ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది? ఎవరి హయాంలో క్యాపిటల్‌ క్రియేషన్‌ జరిగింది? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరుగెత్తుతున్నాయి?

ఇంకొకటి చూద్దామా? ఇంకొకడు అంటాడు జగన్‌ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడు.. జగనేమో ఒకపక్క ఇస్తాడు, మరో పక్క ట్యాక్సులతో బాదేస్తాడు అని చెప్పి ఇంకో మాట కూడా మన మీద మాట్లాడతారు. అదీ చూద్దామా పోనీ. ట్యాక్స్‌ బర్డెన్‌ యాజ్‌ ఎ పర్సెంటేజ్‌ ఆఫ్‌ జీఎస్‌డీపీ. చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్‌ బర్డెన్‌ ఆఫ్‌ యాజ్‌ ఎ పర్సెంటేజ్‌ ఆఫ్‌ జీఎస్‌డీపీ చూస్తే 6.57 శాతం అయితే, జగన్‌ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు. ఆర్బీఐలు, కాగ్‌లు, స్టేట్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్లు అన్ని చోట్లా ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్లు.

ఇవన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే.. అబద్ధానికి వీళ్లంతా కూడా రెక్కలు కట్టి వీళ్లంతా ఏమాదిరిగా దీన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు? ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చెబుతున్నా. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెబుతున్నాను. చేయలేకపోతే చేయలేను అని చెబుతాడు తప్ప జగన్‌ ఎప్పుడూ అబద్ధాలు ఆడడు. జగన్‌ ఎప్పుడూ మోసం చేయడు. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్‌ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనవి కూడా చాలా చేశాం. చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో.

ఇప్పుడు కాపు నేస్తం ఉంది మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్‌ ఉన్నాయి. మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది. మేనిఫెస్టోలో లేదు. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంచడం, పిల్లలకు విద్యా కానుక, గోరుముద్ద మేనిఫెస్టోలో లేవు. ఇటువంటివి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. ప్రతి ఒక్కరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఒక్కటే. ఈరోజు ఉన్న పరిస్థితుల దష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో, ఆ మేరకు నేను చెప్పగలుగుతా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదల్చుకోలేదు. ఎందుకంటే అది అబద్ధాలు అని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగినవి మాత్రమే జగన్‌ చెబుతాడు. అవకాశం, వెసులుబాటు ఏ మాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్లీ మళ్లీ చెబుతున్నాను.

అవకాశం, వెసులుబాటు ఏ మాత్రం ఉన్నా కూడా జగన్‌ ప్రతి పేదవాడి కోసం అడుగులు కచ్చితంగా వేస్తాడు అని మాత్రం కచ్చితంగా వేస్తాడు. పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్‌ కు ఉన్న ప్రేమ, చంద్రబాబుకు కాదు కదా.. ఇంక ఎవరికీ కూడా ఆ ప్రేమలుండవు. చంద్రబాబునాయుడుకు అయితే ప్రేమ ఉండదు అది వేరే విషయం. ఎవరికీ కూడా అటువంటి ప్రేమలుండవు.” అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: YSRCP Manifesto: వైయస్సార్‌ సీపీమేనిఫెస్టో రిలీజ్.. సీఎం జగన్‌ కామెంట్స్‌ ఇవీ..
YSRCP Manifesto 2024: దటీజ్‌ జగన్ గట్స్‌.. మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ప్రజాకర్షక హామీ లేదు!
YS Jagan Election Campaign: 28వ తేదీ నుంచి రోజూ మూడు ప్రాంతాల్లో జగన్‌ సభలు
YS Jagan in Pulivendula: బంధువులకు దోచిపెట్టడానికి సీఎం కాలేదు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు