HomeAndhra PradeshYSRCP Manifesto: 2024 వైయస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..

YSRCP Manifesto: 2024 వైయస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..

YSRCP Manifesto: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో 2024ను సీఎం జగన్‌ నేడు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. మేనిఫెస్టోకు సంబంధించిన వివరాలు చదివి వినిపించారు.

ఈ సారి కూడా మనది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. ఇంతకు ముందు ఇదీ మన మేనిఫెస్టో. ఇప్పుడు ఇదీ మన మేనిఫెస్టో(మేనిఫెస్టోలు చూపిస్తూ). ఈ మాదిరిగా.. మన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించినవి గమనిస్తే, ముఖ్యమైన అంశాలు పైన చెబుతాను. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, డిజిటల్‌ బోధన.

వైద్యం..
విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ. ఆరోగ్య ఆసరా, విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష.

వ్యవసాయం..
రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్‌పుట్‌ సబ్సిడీ.

ఉన్నత విద్య..
జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజురీయింబర్స్‌ మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్‌ ఓరియంటెడ్‌ గా కరిక్యులమ్‌ లో మార్పులు.

నాడు నేడు..
స్కూళ్లు, ఆస్పత్రులు. పేదలందరికీ ఇళ్లు, అక్కచెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు.

మహిళా సాధికారత..
చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ.

సామాజిక భద్రత..
పెన్షన్‌ కానుక 2 విడతల్లో రూ.3,500కు పెంపు. ఎప్పటిలాగే ఇంటివద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ.

అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన..
ప్రస్తుతం నిర్మిస్తున్న 4 పోర్టులు పూర్తి చేస్తాం, ఫిషింగ్‌ హార్బర్ల పూర్తి, ఎయిర్‌ పోర్టులు, వాటి విస్తరణ పూర్తి, ఇండస్ట్రియల్‌ కారిడార్లు పూర్తి, నోడ్స్‌ పూర్తి, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం పూర్తి, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ. ఇదీ దీనికి సంబంధించిన సమ్మరీ.

డెప్త్‌ లోకి పోయే అంశాల్లోకి మనం ఒకసారి పోతే.. మహిళలు.. నా అక్కచెల్లెమ్మలు.. వీళ్లకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైయస్సార్‌ చేయూత. ఈ కార్యక్రమం ఇంతకు ముందు రూ.75 వేలు ఉండేది. నాలుగు దఫాలుగా ప్రతి అక్కచెల్లెమ్మకూ వైయస్సార్‌ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న నా అక్కచెల్లెమ్మలకు చేయి పట్టుకుని నడిపిస్తూ వాళ్లకు ఏదో ఒక ఆదాయం ఉండాలి, నిలదొక్కుకోవాలి, సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్లకు మరింత ఆదాయం సంపాదించుకునే పరిస్థితిలోకి పోవాలి. వాళ్లకు పెన్షన్‌ గానీ, చేయూత గానీ ఇలా ఏదో ఒక ఆదాయం వాళ్లకు ఉండాలి అనే ఉద్దేశంతో వైయస్సార్‌ చేయూతను కొనసాగిస్తున్నాం. ఇంతకు ముందు 5 ఏళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇచ్చాం. దాన్ని కొనసాగిస్తూ మళ్లీ నాలుగు దఫాలు రూ.1.50 లక్షల దాకా తీసుకుని పోతాం. వాళ్లను మళ్లీ చేయి పట్టుకుని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది.

వైయస్సార్‌ కాపు నేస్తం..
ఇకపై రూ.1.20 లక్షల వరకు. ఇంతకు ముందు 4 దఫాల్లో రూ.60 వేలు ఇచ్చాం. మళ్లీ వచ్చే పీరియడ్‌ లో ఈ నాలుగు దఫాల్లో మరో రూ.60 వేలతో రూ.1.20 లక్షల వరకు పెంపు.

వైయస్సార్‌ ఈబీసీ నేస్తం..
ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45 వేలు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ఈ 5 ఏళ్లలో 4 దఫాల్లో మరో రూ.60 వేలు ఇస్తూ రూ.1.05 లక్షల వరకు దాన్ని పెంపు.

జగనన్న అమ్మ ఒడి అనేది పిల్లలకు సంబంధించినది కాబట్టి నా మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకు ముందు రూ.15 వేలు ఉండేది. రూ.13 వేలు నేరుగా అక్కచెల్లెమ్మల చేతికి ఇచ్చే పరిస్థితి. మరో రూ.2 వేలు వాళ్ల స్కూలు బాగోగుల కోసం ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ల గవర్నమెంట్‌ బడుల స్కూల్స్‌ మెయింటెనెన్స్, టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ కోసం ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మ ఒడి రూ.15 వేలు కాస్తా రూ.17 వేలకు పెంచుతున్నాం. తల్లి చేతికే నేరుగా రూ.15 వేలు వస్తుంది. ఆ తర్వాత పిల్లలు వెళ్లే గవర్నమెంట్‌ బడులు, ఆ స్కూల్స్‌ లో ఉన్న టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ కోసం, ఆ స్కూల్స్‌ మెయింటెనెన్స్‌ కోసం మరో రూ.2 వేలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ దాని కోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మ ఒడి రూ.17 వేలు చేస్తూ తల్లి చేతికి రూ.15 వేలు ఇవ్వడం జరుగుతుంది.

వైయస్సార్‌ సున్నా వడ్డీ, వైయస్సార్‌ ఆసరా కింద రూ.25,571 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18 శాతం ఓవర్‌ డ్యూస్, నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్స్‌ గా మారి ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ సంఘాల నుంచి పూర్తిగా సీ గ్రేడ్, డీ గ్రేడ్‌ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన అక్కచెల్లెమ్మలను చేయిపట్టుకుని నడిపిస్తూ ఈ నాలుగు దఫాలుగా ఇచ్చే రూ.25,571 కోట్లు విజయవంతంగా పూర్తి చేసిన పరిస్థితులు. ఆ అక్కచెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ రూ.3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కొనసాగుతుంది.

వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా..
ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్లీ కొనసాగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలో కూడా ఒక రీజన్, లాజిక్‌ ఉండాలి. అమ్మ ఒడి ఉంది. 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. ఇప్పుడు కూడా జరుగుతోంది. యధావిధిగా ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అదే విధంగా కల్యాణమస్తు, షాదీ తోఫా. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రతీదీ ఒక పర్పస్‌ ఉండాలి. చదువును ప్రోత్సహించేందుకు, చేయిపట్టుకుని నడిపించేందుకు, వాళ్లను వాళ్ల జీవితాల్లో ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రతి పథకమూ ఉండాలి.

పేదలందరికీ ఇళ్ల పట్టాలు..
ఇప్పటికే 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్లు పూర్తి కూడా అయిపోయాయి. మిగతావి వేగంగా పనులు జరుగుతున్నాయి.ఇది వచ్చే 5 ఏళ్లు కూడా కొనసాగుతుంది. అర్హులై ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలన్స్‌ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇళ్లు కట్టడానికి ఆ 10 లక్షలు ఇంకా కొంచం ఎక్కువ వేసుకున్నా కూడా వాళ్లు ఇంకా అప్లికేషన్‌ పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్లకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది.

లబ్ధిదారుల సంఖ్య చూస్తే…
అసలు ఈ లబ్ధిదారుల సంఖ్య ఒకసారి చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలు.. 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది రూ.19,189 కోట్లు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4.63 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,030 కోట్లు. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.18,777 కోట్లు.

జగనన్న అమ్మ ఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది రూ.26,000 కోట్లు. వైయస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది రూ.4,969 కోట్లు. వైయస్సార్‌ ఆసరా ద్వారా మరో 79 లక్షల మందికి ఇచ్చింది రూ.25,571 కోట్లు. వైయస్సార్‌ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో రూ.427 కోట్లు. పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలం కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం జరుగుతోంది. ఇవి ఇంతకు ముందు నేను చెప్పిన వాటికి ఈ నంబర్స్‌ మిస్‌ అయ్యాయి. ఈ నంబర్స్‌ యాడ్‌ చేశాను.

పట్టణ గృహనిర్మాణం..
ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో ప్రత్యేకించి మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌నకు సంబంధించి. దీనికోసం ప్రతి ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తూ 2 సంవత్సరాల్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ ఎంఐజీ లే అవుట్‌ డెవలప్‌మెంట్‌ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్‌ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్‌ రేట్లలో మార్కెట్‌ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్‌కు లాభం వేసుకోకుండా తక్కువ రేటుకే వాళ్లందరికీ కూడా ఈ ప్లాట్స్‌ అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని వల్ల టౌన్స్, సిటీస్‌ లో ఇటువంటి చోట మిడిల్‌ ఇన్‌ కమ్‌ గ్రూపులో ఉన్న వాళ్లందరికీ కూడా అధికారిక పట్టా, అధికారిక డాక్యుమెంట్స్‌ తో తక్కువ రేటుకు వీళ్లందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్‌ లో పట్టాలు అందుబాటులో ఉంటాయి.

పెన్షన్ల పెంపు..
అసలు ఈ పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలున్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్‌ ఎంత అంటే రూ.1,000. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్‌ 66 లక్షల మందికి పెన్షన్‌. పెన్షన్‌ సొమ్ము రూ.3 వేలు. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది రూ.24 వేల కోట్లు.

చాలా ముఖ్యమైన విషయం..
చాలా ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత రూ.3 వేలు ఇస్తున్న రాష్ట్రంగానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం గానీ దేశంలో ఏదీ లేదు. ఇలా సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్‌ కోసం మనం ఖర్చు చేస్తుంటే హయ్యస్ట్‌ ఇన్‌ ద కంట్రీ. తెలంగాణలో ఎంతో తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్‌ అమౌంట్‌ రూ.2 వేలు, ఖర్చు చేసేది సంవత్సరానికి రూ.12,230 కోట్లు. ఉత్తర ప్రదేశ్‌ లో పెన్షన్‌ అమౌంట్‌ రూ.1,000, ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది రూ.9,592 కోట్లు. రాజస్థాన్‌ లో పెన్షన్‌ అమౌంట్‌ రూ.750, ఇచ్చేది 90 లక్షల మందికి, జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు. రూ.8,114 కోట్లు వాళ్లు సంవత్సరానికి ఖర్చు.

కేరళలో వాళ్లు రూ.1,600 ఇస్తున్నారు నెలకు. 48 లక్షల మందికి ఇస్తున్నారు. రూ.7,295 కోట్లు. దేశం కన్నా మనం ఎంత పైనున్నామో ఒక్కసారి గమనించాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. జగన్‌ కు మనసు, మానవత్వం ఉన్నాయి. అవ్వాతాతల మీద జగన్‌ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవరూ చూపించలేదు, చూపించబోరు. ఎందుకు చెబుతున్నానంటే.. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా రూ.3,500కు పెంచుతాం. రూ.250 పెరిగేది జనవరి 2028. ఇంకో రూ.250 పెరిగేది జనవరి 2029. డేట్లతో సహా ఎందుకు చెబుతున్నానంటే కల్మషం లేదు నాలో. అబద్ధం చెప్పదల్చుకోలేదు. మోసం చేయదల్చుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్టు చేయాలి. సపోర్టు చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం. ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయనుకూడా చేయలేం. రూ.250 పెరిగిందంటే దాదాపుగా దాని కాస్ట్‌ రూ.2000 కోట్లు పైచిలుకు పడుతుంది. మరో రూ.250 పెరిగిందంటే దాని కాస్ట్‌ రూ.4,000 కోట్లు ప్రతి సంవత్సరం.

సపోర్ట్‌ చేసేపరిస్థితులు ఉండాలి. కుదుట పడి, ఇప్పుడు చేస్తున్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ కుదుట పడి, మళ్లీ కొద్దోగొప్పో వెసులుబాటును మళ్లీ వచ్చి కొద్దో గొప్పో వెసులుబాటును నేను మళ్లీ అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో, మళ్లీ డిస్ట్రిబ్యూట్‌ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడంటే అదీ లాస్ట్‌ 2 సంవత్సరాల్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ నంబర్లు కూడా అప్పుడు ఇస్తాను అని కచ్చితంగా చెబుతున్నాను.

వ్యవసాయ రంగం..
రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు రూ.50 వేలు ఇస్తాం 5 సంవత్సరాల్లో అని చెప్పి రైతన్నలకు రూ.67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. రూ.13,500 రైతు భరోసాగా ఇస్తూ. ఈసారి ఈ 13,500ను రూ.16,000కు పెంచి ఈ 5 సంవత్సరాల్లో రైతన్నకు మరో రూ.80 వేలు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా అనే పథకం ద్వారా. దీని వల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీని వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఇస్తున్న మాదిరిగానే మూడు దఫాల్లో జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్‌ సమయంలో, మళ్లీ సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది.

పంట వేసే సమయంలో రూ.8 వేలు ఇస్తాం. కటింగ్‌ సమయంలో మరో రూ.4 వేలు, సంక్రాంతికి మరో రూ.4 వేలు ఇస్తాం. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు ఇప్పుడు ఇస్తున్నట్టుగానే కొనసాగుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తున్నాం. అది కొనసాగుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయం ఒక్కటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్‌ మాత్రమే నేను చెబుతున్నా. మేనిఫెస్టో నెట్‌ లో అందుబాటులో పెడతాం. ఎవరైనా కూడా నెట్‌ లో పూర్తిగా సమగ్రంగా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టోను మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గవర్నమెంట్‌ ఆఫీసులో, నెట్‌ లో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆరాటపడతాను.

స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తున్నట్టుగా కొనసాగుతుంది. ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా మత్స్యకారులకు రూ.50 వేలు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో కూడా మరో రూ.50 వేలు ఇస్తూ మొత్తంగా దాన్ని రూ.1 లక్ష దాకా తీసుకుని పోతాం. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో రూ.50 వేలు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో రూ.50 వేలు ఇస్తాం. మొత్తంగా చూస్తే.రూ.1లక్ష వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది.

మత్స్యకార భరోసా
మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2.43 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలకు మంచి జరిగిస్తూ రూ.538 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 2.76 లక్షల మందికి మంచి జరిగిస్తూ రూ.1,300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదొక్కటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ సొంత టిప్పర్, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తున్నాం.

ఇదొక్కటే కాకుండా ఆటో, టాక్సీ, స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ,సొంత టిప్పర్లు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింప చేస్తున్నాం. ఆటో కి మాత్రమే కాదు, టాక్సీ కి మాత్రమే కాదు, మ్యాక్సీ క్యాబ్‌ కి మాత్రమే కాదు, సొంతంగా టిప్పర్లు లారీలు నడిపే డ్రైవర్లకు కూడా వర్తింప చేస్తున్నాం. ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా కింద పది లక్షల రూపాయల దాకా ఇచ్చేలాగా కార్యక్రమం చేస్తాం. దీనికోసం వారికి రిజిస్టర్‌ చేసి ఐడి కార్డులు ఇస్తాం.

స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో టాక్సీ లారీ కొనుగోలు కోసం, బ్యాంకులు నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే, ఆ రుణాల మీద మూడు లక్షలు వరకు, వాటిపై ఆరు శాతం వడ్డీ భారం మాత్రమే ఉండేలా, అంటే అర్ధరూపాయి వడ్డీ భారం మాత్రమే వారికి ఉండేలా, మిగతా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

న్యాయవాదులకు లా నేస్తం ఇప్పుడు ఇస్తున్న విధంగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5,781 మందికి రూ.42 కోట్ల రూపాయలతో లా నేస్తం కింద, వాళ్ల సర్వీస్‌ లోని తొలి మూడు సంవత్సరాల్లో, వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతీనెల రూ. 5,000 చొప్పున ఆరు నెలలకొకమారు రూ. 30,000 ఇస్తూ చేయిపట్టి నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. కొత్తగా వచ్చే అందరికీ ఈ పథకం ఇదే విధంగా కొనసాగుతుంది. చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపు 1,20,000 మందికి మంచి చేస్తూ రూ.1,20,000 చొప్పున ఇవ్వగలిగాము. ఈ పథకాన్ని మళ్లీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా దీన్ని కొనసాగిస్తూ మరో రూ.1,20,000 చొప్పునఅందించనున్నాము. దీంతో గత ఐదేళ్లలో, రానున్న ఐదేళ్లలో కలిపి ఒక్కో లబ్దిదారునికి ఇచ్చే మొత్తాన్ని రూ.2,40,000 వరకు తీసుకెళ్తాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా చేనేత కార్మికులకు, ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో సహా రూ.468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేశాం.

రాష్ట్రంలో స్కిల్‌ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్‌ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్‌ హబ్‌ నెలకొల్పుతాం. ఆ స్కిల్‌ హబ్‌ ద్వారా ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్‌ డ్రాప్‌ అవుట్స్‌ ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్‌పాంలోకి తీసుకువచ్చి, ఒక స్కిల్‌ హబ్‌ గా దాని తయారు చేస్తాం. దీని వల్ల వర్క్‌ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్‌ షాప్స్‌ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్‌ ఎఫిషియన్సీ పెరుగుతుంది.. దీనికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ, రాష్ట్రంలో 175 స్కిల్‌ హబ్స్, జిల్లా కేంద్రాల్లో 26 స్కిల్‌ డెవలప్మెంట్‌ కాలేజీలు, ఒక స్కిల్‌ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం. యూనివర్సిటీ డైనమిక్‌ గా కోర్సులను ఇవాల్వ్‌ చేస్తుంది. ఇండస్ట్రీ ని ఇందులో భాగస్వామ్యం చేస్తుంది. ఇండస్ట్రీలను కలుపుకుంటూ వాళ్ళ రిక్వైర్‌మెంట్స్‌ను ఇందులోకి తీసుకువస్తూ, డైనమిక్‌ గా ఈ కోర్సులను వాళ్లందరికీ ఇంపాక్ట్‌ చేస్తుంది. ఈ స్కిల్‌ కాలేజీలను నెలకొల్పడమే కాకుండా, ఇక్కడ సీట్‌ తెచ్చుకుని, మనం ఎవరికైతే ట్రైనింగ్‌ ఇస్తామో, వారికి పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ.2,500 అబ్బాయిలకు, రూ.3,000 వరకు అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతుంది.

వచ్చే ఐదేళ్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చి, మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీలు కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తున్నాం. 2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్‌ ను పెంచుకుంటూ 2035 నాటికి పదవ తరగతి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న టోఫెల్‌ క్లాసులు మూడో తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రత్యేక ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్‌ లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి త్వరితగతిన పూర్తి చేస్తాం. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తే అడుగులు ముందుకు వేస్తున్నాం.

వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని రానున్న ఐదేళ్లలో హెల్త్‌ ను మరింత సీరియస్‌ గా తీసుకుంటాం. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించాం. ప్రొసీజర్స్‌ను1,050 నుండి 3,300 కు పెంచాం. నెట్వర్క్‌ హాస్పిటల్స్‌ నెంబర్‌ కూడా బాగా పెంచడం జరిగింది. ప్రివెంటివ్‌ కేర్‌ లో ఎవరూ చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్‌ క్లినిక్‌ లు గ్రామస్థాయిలో తీసుకురావడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా వచ్చాయి. ఆరోగ్య రంగం మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలి. ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని అధికారులకు చెప్పడం జరిగింది. నియామకాల విషయంలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ లో 61% ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54 వేల పోస్టుల రిక్రూట్మెంట్‌ కేవలం వైద్యరంగంలో జరిగింది.

ఇప్పటికే 17 కొత్త మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ఐదు మెడికల్‌ కాలేజీలు ఇప్పటికే నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్‌ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. గుండెకి సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్‌ హబ్‌ లు.. గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లు.. కొత్తగా 17 నర్సింగ్‌ కాలేజీలు.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో రూ. 45,412 కోట్లు ఇవ్వగలిగాం. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.23,469 కోట్ల రూపాయిలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డిబిటి ద్వారా ఈ ఐదేళ్లలో రూ.13,389 కోట్లు ఇవ్వగలిగాము. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ. 5,963 కోట్లు అందించగలిగాం.

ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు ఆర్‌ ఓ ఎఫ్‌ ఆర్ పట్టాల కింద పంచడం జరిగింది. 1,54,000 ఎస్టీ కుటుంబాలకు మంచి జరిగింది. ఎస్సీలకు ఇప్పుడే మూడు కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రతి గూడెంను పంచాయితీగా వర్గీకరిస్తూ 165 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాలు, అక్కడ అన్ని ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం జరిగింది.

మొత్తం జనాభాలో కనీస 50% దళితులు ఉండి లేదా ఆ దళితుల జనాభా 500 కు పైగా ఉన్నా ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దీన్ని కొత్తగా చేయబోతున్నాం. క్రిస్టియన్‌ మైనారిటీ, ముస్లిం మైనారిటీలకు… హిందూ దేవాలయాలకు జరుగుతున్నవి కూడా కొనసాగుతూ ఉంటాయి. కొత్తగా తీసుకు వస్తున్న విషయం ఏమిటంటే హిందూ దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి. అన్ని ప్రార్థనాలయాలకు ఇది తీసుకొస్తున్నాం.

ఇప్పటికే డిబిటి ద్వారా రూ.1,28,000 కోట్లు నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో చెప్తున్నాను. నాయి బ్రాహ్మణులకు ఇచ్చే దాని గురించి కూడా వెబ్సైట్లో వివరంగా పెట్టాము. ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేసామో అనేది కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచాం. కాపు సంక్షేమం కోసం కూడా ఐదేళ్లలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఓసీలికు ఇచ్చిన సంక్షేమ పథకాలు వివరాలను కూడా వెబ్‌సైట్లో వివరంగా పొందుపరిచాం.

కులవత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి చిన్న మార్పు చేయబోతున్నాం. జననన్న తోడు ద్వారా 16 లక్షల మందికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి, ఫుట్‌ పాత్‌ ల మీద, తోపుడు బండ్ల మీద అమ్ముకుంటున్న వారు, ఇలాంటివారు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే రుణాల అందించే కార్యక్రమం. దాదాపుగా రూ. 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీని ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి రుణాల అందించే కార్యక్రమం చేస్తున్నాం. రుణాలను సవ్యంగా తిరిగి కట్టడాన్ని ప్రోత్సహిస్తూ, సవ్యంగా కట్టిన వారికి మరో సంవత్సరం రుణాన్ని పెంచుతూ రూ.13,000 దాకా రుణం ఇచ్చేలా తీసుకుపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం రూ.15 వేలకు పెంచి, రూ.20,000 దాకా తీసుకెళుతున్నాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్‌.

లక్షల మందికి పెట్టుబడి సహాయం కింద రూ. 10,000 మాత్రమే ఉండేది ఇప్పుడు రూ.15,000 అయింది. సకాలంలో చెల్లించిన వారికి ప్రతి ఏడాది రూ.1,000 చొప్పున పెంచుకుంటూ రూ. 20,000 ఇప్పించే కార్యక్రమం చేస్తాం. జగనన్న చేదోడు ఈ పథకం కింద షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా పదివేలు ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి రూ.1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో కూడా ఈ పథకం ఇలాగే కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీరందరికీ ఏమేం చేసాము అనేది వివరంగా వెబ్‌సైట్లో ఉంచాం.

వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, ఈ ఏడాది నుండీ విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో పదిలక్షల వరకు పూర్తి వడ్డీని కోర్స్‌ పూర్తయ్యే వరకు, లేదా గరిష్టంగా ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుంది.

25,000 వరకు జీతం పొందే ఆప్కాస్‌ అంటే ఔట్ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ లో పనిచేస్తున్నవారు… అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలు వీళ్ళకి కూడా లభిస్తాయి. బిపిఎల్‌ కుటుంబాలకు సంబంధించి గతంలో అప్పర్‌ సీలింగ్‌ అనేది రూ.6,000, రూ.5,000 గా ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గ్రామాల్లో రూ.10,000, రూ.12,000 కు పెంచాము.

నేడు పథకాల లబ్ధిదారులైన కుటుంబాలు రాష్ట్రంలో దాదాపు 90 శాతం. ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది బటన్‌ నొక్కితే తెలిసే విధంగా డేటా తో సహా పారదర్శకంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా బటన్‌ నొక్కితే వారి కుటుంబాల ఖాతాలకు వెళ్ళేలాగా చేస్తున్నాం.

స్విగ్గి, జొమాటో అమెజాన్‌ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్‌ కు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఐదు లక్షల జీవన బీమా కల్పించే కార్యక్రమం తీసుకువస్తున్నాం. వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకొస్తాం. నాలుగు పోర్టులు కడుతున్నాం. త్వరలో పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కడుతున్నాం. నాలుగు పోర్టుల్లో మూడు రాష్ట్ర ప్రభుత్వమే కడుతోంది. ఒకటి మాత్రం ప్రైవేట్‌ గా డెవలప్‌ అవుతోంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు రూ.20 వేల కోట్లు. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లాండింగ్‌ సెంటర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.4,500 కోట్లు. ఇవన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్పోర్ట్‌ పనులు వాయువేగంగా జరుగుతున్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది.

వచ్చే ఐదు సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెట్టబోతున్నాం. వాటర్‌ గ్రిడ్‌ ను కనెక్ట్‌ చేస్తూ, కంటామినేటెడ్‌ వాటర్‌ ను మూవ్‌ చేస్తున్నాం. ఇప్పటికే పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో రూ.785 కోట్ల రూపాయలతో కంటామినేషన్‌ లేని సర్ఫేస్‌ వాటర్‌ ను అందించి కిడ్నీ వ్యాధులతో సమస్యలతో ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతోంది. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2 టన్నెల్స్‌ పూర్తి అయ్యాయి కనుక, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది. వీటన్నిటిని ఒక గ్రిడ్‌ ద్వారా కనెక్ట్‌ చేస్తే ఈ ప్రాంతాలకు కూడా శాశ్వతంగా మేలు జరుగుతుంది. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఆక్వా ప్రాంతం అంతా, వాటర్‌ కంటామినేషన్‌ అంతా ఉన్న ప్రాంతాల సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస పెడుతున్నాం.

రోడ్ల మరమ్మత్తులు అభివద్ధిపై కూడా ప్రత్యేక దష్టి పెడుతున్నాం. రోడ్ల మరమ్మతుల విషయమే తీసుకుంటే గత ప్రభుత్వంలో రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తే, మన ప్రభుత్వంలో రూ.43 వేల కోట్లు ఖర్చు చేశాం. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు. మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది, కానీ దాని ప్రభావం రోడ్లమీద కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. రోడ్ల విషయంలో మనం అనుకున్న స్థాయిలో అభివద్ధి కనపడక పోయి ఉండకపోవచ్చు. దాని మీద కూడా ప్రత్యేక ధ్యాస పెట్టబోతున్నాం. రోడ్లు, పార్కులు, డ్రైనేజ్‌ వంటి మౌలిక సదుపాయాలకు స్మార్ట్‌ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివద్ధి చేసే దిశగా ఇంకా అడుగులు వేస్తూ రూ.2,000 కోట్లు దానికోసం కేటాయింపు చేసి ఆ వసతులు అన్ని ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి.

ప్రతి జిల్లాలో పీపీటీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్‌ పార్క్‌ కచ్చితంగా ఉండేలా అభివద్ధి చేస్తున్నాం. ఎం ఎస్‌ ఎం ఈ లకు ఇప్పటికే రెండుసార్లు ప్రోత్సాహకాలను అందించాం. ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు ముందుకు వేస్తాం. 2024లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలన రాజధానిగా పాలన సాగిస్తాం. రాష్ట్ర అభివద్ధికి గ్రోత్‌ ఇంజన్‌ లా పనిచేసేలా విశాఖన అభివద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివద్ధి చేస్తాం.

జలయజ్ఞానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. ఇప్పటికే రిజర్వాయర్ల కెపాసిటీని పెంచాం. చిత్రావతి, వెలిగొండ రెండు టన్నులు పూర్తి చేయడం, అవుకు రెండు టన్నులు పూర్తి కావడం, రాయలసీమ లిఫ్ట్‌ కూడా త్వరలో పూర్తి చేయబోతున్నాం. పోలవరం కూడా త్వరలో పూర్తి చేస్తాం. వీటన్నిటిని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తాం. వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 15 మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 పోరŠుట్ల, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లైనింగ్‌ సెంటర్లను పూర్తి చేస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్పోర్ట్‌ పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టల్స్, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమాలు పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం.

17 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపు 6వేల రెవెన్యూ పంచాయతీలలో రీ సర్వే పూర్తయింది. మిగిలినవి కూడా పూర్తి చేస్తాం. కర్నూల్‌ లో లా యూనివర్సిటీ పూర్తి చేస్తాం. డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం. గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ రెండు కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కూడా త్వరగా పూర్తి చేస్తాం. ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ లు, కోల్డ్‌ స్టోరేజ్‌ లు, గోడౌన్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు అవి కూడా పూర్తి అవుతాయి.

ఎడెక్స్‌ ద్వారా మరిన్ని ఆన్లైన్‌ వర్టికల్స్‌ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు అందజేస్తూ, డిగ్రీలో కోర్సులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్‌ మీడియం తో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్‌ ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ కూడా వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తాం.” అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: YSRCP Manifesto 2024: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదలలో జగన్‌
YSRCP Manifesto: వైయస్సార్‌ సీపీమేనిఫెస్టో రిలీజ్.. సీఎం జగన్‌ కామెంట్స్‌ ఇవీ..
YSRCP Manifesto 2024: దటీజ్‌ జగన్ గట్స్‌.. మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ప్రజాకర్షక హామీ లేదు!
YS Jagan Election Campaign: 28వ తేదీ నుంచి రోజూ మూడు ప్రాంతాల్లో జగన్‌ సభలు
YS Jagan in Pulivendula: బంధువులకు దోచిపెట్టడానికి సీఎం కాలేదు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు