HomeNationalLok sabha elections: లోక్‌ సభ ఎన్నికలకు నగారా.. తొలి దశ నోటిఫికేషన్‌ జారీ

Lok sabha elections: లోక్‌ సభ ఎన్నికలకు నగారా.. తొలి దశ నోటిఫికేషన్‌ జారీ

Lok sabha elections: సార్వత్రిక ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఇవాళ్టి నుంచి ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం మొదలవుతోంది. మొదటి దశలో 102 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్‌ ఇచ్చింది. లెజిస్లేటివ్ కౌన్సెల్ జాయింట్‌ సెక్రటరీ దివాకర్‌ సింగ్‌ పేరుతో బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సందడి మొదలు కానుంది. Lok sabha elections

మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని నోటిఫికేషన్‌లో ఈసీ వెల్లడించింది. ఈనెల 27వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. అనంతరం 28వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఈ నెల 30 లోగా ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్‌ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరగబోతోంది. ఫలితాలు జూన్‌ 4న అన్ని దశల ఎన్నికల ఫలితాలతో పాటే విడుదల అవుతాయి.

మొదటి దశ ఎన్నికలు జరిగే వాటిలో తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌ 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అస్సాంలలోని ఐదు చొప్పున, బీహార్‌ 4, పశ్చిమ బెంగాల్‌ 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లో రెండు చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కాశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి.

తొలి దశ డీటెయిల్స్‌ ఇవీ..

* నోటిఫికేషన్‌ తేదీ: మార్చి 20
* నామినేషన్ల గడువు: మార్చి 27
* నామినేషన్ల పరిశీలన: మార్చి 28
* ఉపసంహరణకి లాస్ట్‌ డేట్‌: మార్చి 30
* పోలింగ్‌ జరిగేది : ఏప్రిల్‌ 19

సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఏప్రిల్‌ 19న మొదలుకొని జూన్‌ 1 వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లో దేశంలో పోలింగ్‌ జరుపుతోంది.

ఇవీ చదవండి: Kalki 2898AD: ప్రభాస్‌ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవీ..
General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు