Summer Heat: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల వేడితో పాటు ఎండలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యెర్రంపేట, కొమరాడలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నందవరం (నంద్యాల)లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జామి (విజయనగరం)లో 45.5 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా కోవిలం, కొంగలవీడులో 45.4 డిగ్రీలు నమోదైంది.
తిరుపతి జిల్లా రేణిగుంట, ప్రకాశం జిల్లా దరిమడుగులో 45.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా ముటుకూరులో 44.9 డిగ్రీలు నమోదైంది. కంబాలకుంట (అన్నమయ్య జిల్లా), కసుమూరు (నెల్లూరు)లో 44.6 డిగ్రీలు, వగరూరు (కర్నూలు) 44.2 డిగ్రీలు, రావికవతం (అనకాపల్లి)లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు , చిత్తూరు జిల్లా రాయలపేటలో 44 డిగ్రీలు, 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 120 మండలాల్లో వడగాల్పులు వీచాయని వాతావరణ విభాగం తెలిపింది.
ఇవీ చదవండి: Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Perni Nani on Kollu Ravindra: బందరులో పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి!
Body Heat: శరీరంలో వేడి ఎందుకు చేస్తుంది? నష్టాలేంటి? బాడీలో హీట్ తగ్గాలంటే ఏం చేయాలి?
Sabja Ginjalu: ఈ వేసవిలో సబ్జా గింజలతో ఇలా చేయండి.. వేడి నుంచి తక్షణ ఉపశమనం గ్యారెంటీ!
