HomeAndhra PradeshYS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు కీలక ఉత్తర్వులు.. ఎవరూ...

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు కీలక ఉత్తర్వులు.. ఎవరూ మాట్లాడొద్దని ఆదేశం

YS Viveka Case: మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇటీవల రాజకీయ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసుపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని కడప కోర్టు ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల, నర్రెడ్డి సునీత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ సహా నారా లోకేష్, పురంధేశ్వరి తదితరులు వివేకా హత్య కేసుపై రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్‌ టార్గెట్‌గా, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కడప మేయర్‌ సురేష్‌ బాబు కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య ప్రస్తావన పై కోర్టుకు పలు విషయాలు విన్నవించారు సురేష్ బాబు. పిటిషనర్ తరణఫున వాదనలను న్యాయవాది నాగిరెడ్డి వినిపించారు. ఈ నేపథ్యంలో కోర్టు వైఎస్ వివేకా హత్యపై సంచలన తీర్పు ఇచ్చింది. వివేకా హత్యను ప్రస్తావించొద్దని బాబు, లోకేష్, పవన్, పురంధేశ్వరి, షర్మిల, సునీతను ఆదేశించింది.

ఇవీ చదవండి: Viveka murder case: వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
Star Campaigners of Babu: బాబును జాకీలు పెట్టి లేపే స్టార్‌ క్యాంపెయినర్లు.. షర్మిలపై సీఎం జగన్‌ పరోక్ష సెటైర్లు
YSRCP vs Sharmila: అన్న జగన్‌పై కామెంట్స్‌తో దూకుడు పెంచిన షర్మిల? వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను తట్టుకోగలరా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు