Body Heat: చాలా మంది శరీర తత్వాన్ని బట్టి వేడి చేస్తూ ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నా లేదంటే సహజంగానే వారి శరీర స్వభావాన్ని బట్టి అప్పుడప్పుడూ వేడి చేస్తుంటుంది. ఈ వేడి ఎందుకు చేస్తుందంటే.. మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారంలో ఎక్కువగా మసాలాలు, నూనెలు ఉన్నా కూడా శరీరం హీట్ చేస్తుందంటున్నారు. (Body Heat)
ఒక్కోసారి తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం కూడా జరుగుతుంటుంది. అరుగుదల సమస్యలున్న వారికి కూడా హీట్ ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం అరగకపోవడంతో గ్యాస్ ఫామ్ అవుతుంది. మరోవైపు నాన్ వెజ్ అంటే.. చికెన్, మటన్, రొయ్యలు లాంటివి మసాలాలు పెట్టి తింటుంటారు. ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు శరీరం అరిగించుకొనేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.
శరీరానికి సరిపడా నీరు తాగుతుండాలి. నీళ్లు తక్కువ తాగినా కూడా వేడి చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరికి శరీర తత్వమే వేడితో కూడుకొని ఉంటుంది. అలాంటి వారికి ఇలాంటివన్నీ కూడా తోడైతే మరింత వేడి చేసే ప్రమాదం ఉంటుంది.
వేడి ఎక్కువైతే నష్టాలు..
1. యూరిన్‌లో మంటగా అనిపిస్తుంది.
2. కళ్లలో మంటగా అనిపిస్తుంది.
3. శరీరంలోని పలు భాగాల్లో వేడి పొక్కులు రావడం
4. తలనొప్పి రావడం, తల పట్టేయడం
5. జుట్టు రాలడం, చుండ్రు రావడం
6. కండరాలు పట్టేయడం
7. తల తిరగడం…
8. దీర్ఘకాలంలో రక్తనాళాలు, పలు అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.
వేడి తగ్గాలంటే ఏం చేయాలి
1. వేడి తగ్గించుకోవాలంటే మొదట జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. వాటికి తగిన చికిత్స చేయించుకుంటే మంచిది.
2. ప్రతి రోజూ చన్నీళ్ల స్నానం చేయాలి.
3. చల్లటి నీటిలో పాదాలను ఉంచి సేద తీరడం.
4. కొబ్బరినీళ్లు తరచూ తాగుతుండాలి.
5. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి.
6. నాన్‌వెజ్ తినడం తగ్గించాలి.
7. పుచ్చకాయ తినాలి.
ఇదీ చదవండి: Munaga Powder: మునగ పౌడర్… ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!