Pushpa2TheRuleTeaser: అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2 (Pushpa 2) మూవీ సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆల్ సెట్ అంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఎడిటింగ్ పూర్తయినట్లుగా కంప్యూటర్స్ ఎదురుగా తీసిన ఫొటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆగలేకపోతున్నామంటూ అభిమానులు ట్వీట్లు, పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మంధన్న (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా పుష్ప 2 చిత్రం తెరకెక్కింది. తొలి పార్ట్ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ రెండో పార్ట్‌ను ప్రస్టీజియస్‌గా తీసుకున్నారు. ప్రతి సీనులోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత రేపు పుష్ప 2 చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చిత్ర నిర్మాత నిర్మిస్తున్నారు. నిన్న నేషనల్ క్రష్ రష్మిక మంధన్న పుట్టినరోజు కావడంతో పుష్ప మూవీ నుంచి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం.
ఇక పుష్ప పార్ట్ వన్ సమయంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రష్మిక కాస్త సింపుల్‌గా పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన సంగతి తెలిసిందే. కానీ సెకండ్ పార్ట్‌లో మాత్రం కాస్త లుక్ డిఫరెంట్‌గా ఉంది. పట్టు చీర, ఒంటి నిండా నగలు, కాటుక కళ్లతో పవర్ ఫుల్ లేడీగా రష్మిక కనిపించింది. ఈ సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని వినికిడి. మొత్తానికి అల్లు అర్జున్ రెండో పార్ట్‌లో ఇంకెంత పవర్‌ఫుల్‌గా చూపించాడన్నది రేపు ట్రైలర్‌లో తెలుస్తుంది.
ఇవీ చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
