Vasireddy Padma on Pawan: మహిళలను గౌరవించే చరిత్ర ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మహిళల మిస్సింగ్ కేసుల వ్యవహారంలో పవన్ కల్యాణ్ ఏపీ మహిళా కమిషన్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసులపై వైసీపీ ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ ప్రశ్నించడం లేదని, డీజీపీని ప్రశ్నించరా? అంటూ జనసేనాని పేర్కొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై అటు వాసిరెడ్డి పద్మ, ఇటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. (Vasireddy Padma on Pawan)
ఇవాళ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బాబు, పవన్ భాగస్వామ్య ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్న పద్మ.. మహిళల సమక్షంలో రచ్చబండ కు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. చంద్రబాబు మహిళలకు చేసిన ఒక్క మేలైనా చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా పోలీసులను పెట్టాలనే ఆలోచన బాబుకు ఎందుకు రాలేదని నిలదీశారు.
Read Also : Pawan Kalyan on Volunteers: మారిన పవన్ స్వరం.. వలంటీర్లు తనకు సోదర సమానులన్న జనసేనాని!
మహిళా కమిషన్ ను భ్రష్టు పట్టించాలనే మీ ఆటలు సాగబోని హెచ్చరించారు. మహిళా కమిషన్ పై చిందులు వేయడం పవన్, చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. మహిళల అదృశ్యం పై పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబు హయాంలో మహిళలకు సమాన వాటా ఎప్పుడైనా ఇచ్చారా ? పవన్ ది రాజకీయ కోపమా ? రాష్ట్ర ప్రభుత్వం పై కోపమా ? అని ప్రశ్నించారు.
మిస్సైన మహిళల్లో 78 శాతం మంది తిరిగి వచ్చారని డీజీపీ వెల్లడించారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఎక్కడా జరగనిది ఏపీలోనే జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వైఖరి మానుకోవాలన్నారు. తప్పు చేసిన వారిని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు.
రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారన్నారు. మహిళల మిస్సింగ్ లో దేశంలో ఏపీ 11 వ స్థానంలో ఉందన్నారు. ఏపీనే పవన్ టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ప్రేమ వ్యవహారాలతో కూడా అమ్మాయిలు మిస్ అవుతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా ? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు కాదు విషపుత్రుడంటూ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Read Also : Vasireddy Padma: మహిళలపై మహిళలే అలాంటి పోస్టులా..? సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు రావాలి..