Andhra Pradesh: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నగదు భారీగా పట్టుబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల తేదీ ఇంకా దాదాపు 40 రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో తాయిలాలు, బహుమతులు పంచిపెట్టడాలు లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి నగదు, బహుమతులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఏపీలో ఇప్పటివరకు రూ.47.50 కోట్ల మేర పట్టుబడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
రూ.17.85 కోట్ల నగదు, రూ.8.82 కోట్ల మద్యం, రూ.12.37 కోట్ల మేర బంగారం, వెండిని పోలీసులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసినట్లు తెలుస్తోంది. నగదు, మద్యం, వాహనాల సీజ్ వంటి అంశాలపై 4,337 FIRలు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 8,681 లైసెన్స్ డ్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ హింసల వల్ల ఒకరు మృతి చెందగా, 31 మందికి గాయాలు అయ్యాయి. సీ-విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 7,838 ఫిర్యాదులు అందినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: AP BJP List: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్.. నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే!
AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
AP Voters: ఏపీలో 4.08 కోట్ల మంది ఓటర్లు.. కొత్త ఓటర్లు చేరితే మరింత పెరిగే అవకాశం!
AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..
