HomeAndhra PradeshHot weather: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు

Hot weather: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు

Hot weather: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపెడుతోంది. హైదరాబాద్ లో సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా చండీగఢ్, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా అన్ని రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1970 నుంచి 2024 వరకు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. భారత్ లో వాతావరణ మార్పులపై అమెరికా సంస్థ అధ్యయనం చేసింది.

వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ నిలవడం గమనార్హం. ఈ జాబితాలో 28వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ ఏడాది పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ఫిబ్రవరి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

నేడు రాష్ట్రంలోని 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం

మన్యం జిల్లా కొమరాడలో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇవాళ విజయనగరం (19), పార్వతీపురం (12), శ్రీకాకుళం (4), అనకాపల్లి (13), కాకినాడ (9), అల్లూరి (4), ఎన్టీఆర్ (14), తూర్పు గోదావరి (3), కృష్ణా (1), నంద్యాల (19), పల్నాడు (6), గుంటూరు (5), వైఎస్ఆర్ (20), అనంతపురం (1) మండలాల్లో వడగాల్పులు – రేపు 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి: Folding House: ధర రూ.21 లక్షలు.. అమెరికాలో ట్రెండింగ్‌లో ఉన్న మడత పెట్టే ఇళ్ల అమ్మకం
Sabja Ginjalu: ఈ వేసవిలో సబ్జా గింజలతో ఇలా చేయండి.. వేడి నుంచి తక్షణ ఉపశమనం గ్యారెంటీ!
Reducing body heat: శరీరంలో వేడి తగ్గడానికి ఏం చేయాలి? ఎలాంటి ద్రవాలు తీసుకోవాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు