Sajjala on CBN: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని వైయస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
’’వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారు. వాలంటీర్లను తప్పించాలని లెటర్ పెట్టించింది చంద్రబాబే. పెన్షన్ల కోసం ఇవాళ వృద్ధులు, వికలాంగులకు కష్టాలు పడుతున్నారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. చంద్రబాబు స్వార్ధం తప్ప మరేమి చూసుకోలేదు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు.
వాలంటీర్ల వ్యవస్థకు ప్రజల్లో మంచి పేరు వచ్చింది. కుట్రతో వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు బ్రేక్ వేయించారు. వాలంటీర్లను అడ్డుకొని ఇపుడు మాపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలను అర్ధం చేసుకున్నారు. చంద్రబాబుపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. వ్యతిరేకత రావడంతో చంద్రబాబు మాపై ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఎవరూ ఏమీ చేయలేరు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఏమాత్రం లేదు. చంద్రబాబు ఆలోచన అంతా దోచుకోవడమే. జన్మభూమి కమిటీల అరాచకాలు ప్రజలకు గుర్తొచ్చాయి.
వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు. కూటమి పార్టీలన్నీ అధికారుల పై ఒత్తిడి తెస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఈసీ పై ఒత్తిడి తేవడంతోనే అధికారుల బదిలీ జరుగుతోంది. చంద్రబాబు, పురంధేశ్వరి ఫెయిల్యూర్ నేతలు. చంద్రబాబు ఎంత సంజాయిషీ ఇచ్చినా జనం నమ్మరు. ఇలాంటి చిల్లర పనులన్నీ చంద్రబాబుకే సాధ్యం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు. ప్రజలు ఇప్పుడు చంద్రబాబు పై కోపంతో ఉన్నారు.
బాబు, పవన్, లోకేష్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ప్రజాపాలన చేసే జగన్ వైపే ప్రజలు ఉన్నారు. షర్మిల తెలంగాణాలో ఎందుకు పార్టీ పెట్టారో తెలియదు. మళ్లీ ఇక్కడ వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో తెలియదు. ఏపీకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు బ్యాక్ సపోర్ట్ తో షర్మిల ముందుకెళ్తున్నారు. జగన్ పై తప్పుడు ఆరోపణలను ప్రజలు అర్థం చేసుకున్నారు.’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Sajjala on TDP activities: మోసం చేయడంలో కొత్త టెక్నిక్ టీడీపీకి తెలుసు : సజ్జల రామకృష్ణా రెడ్డి
Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
