CM Jagan Good News: టిప్పర్, లారీ డ్రైవర్లకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభవార్త చెప్పారు. సొంతంగా టిప్పర్, లారీ కొనుక్కుని తమ కాళ్లపై తాము నిలబడి, కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్లకు వాహన మిత్ర సాయం అందిస్తామని ప్రకటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ ఇవాళ 8వ రోజు తిరుపతి జిల్లాలో పర్యటించారు. చిన్న సింగమలలో డ్రైవర్లతో ముఖ్యమంత్రి జగన్ ముఖాముకి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఈరోజు ఇక్కడ.. ఆటోలు నడుపుకొంటూ, ట్యాక్సీలు నడుపుకొంటూ, టిప్పర్లు నడుపుకొంటూ తమ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వాగతం. మనమంతా కూడా ఈరోజు ఇక్కడ ఏకమై ఒకవైపున మన సమస్యలను వినేందుకు, మన తరఫున మనకు ఎటువంటి సమస్యలున్నాయని చెప్పి మా తరఫున చట్ట సభలో ఉండాలి, అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోతాం, తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్‌కు మొట్ట మొదటి ప్రభుత్వం అనుకుంటా.. అది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెబుతున్నా.
మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు శింగనమల నియోజకవర్గం నుంచి పోటీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా నిలబెడుతున్నాం. నాకు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు శింగనమల నియోజకవర్గం నుంచి ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుందని, ఒక క్యాండేట్ ఉన్నాడు అని నా దగ్గరకు ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా.. ఆ కేండేట్ ఎవరు? ఆ కేండేట్ కు సంబంధించిన చదువులేమిటి అని అడిగా. చదువు విషయానికి వచ్చే సరికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులు అనే వ్యక్తి, ఆ మనిషి.. మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి, ఎంఏతోనే చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ కేండేట్ ఉన్నాడు.
అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్ గా తాను తన కాళ్ల మీద తాను నిలబడుతూ.. అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా భుజం తట్టి శభాష్ అని చెప్పి అనాల్సింది పోయి.. కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదని చెప్పి తాను బాధపడలేదు. చంద్రబాబు హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలేదు. తాను టిప్పర్ డ్రైవర్ గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలు పెట్టాడు. అటువంటి వీరాంజనేయులును చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి, బీఈడీ చదివి టిప్పర్ డ్రైవర్ గా తన జీవితం కొనసాగుతున్న ఆ వీరాంజనేయులును మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు నిలబెడుతున్నాం మీ అందరి ప్రతినిధిగా. మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభల్లో లేవనెత్తడానికి మీ తరఫున మీ సోదరుడిగా చట్టసభలో ఉండేందుకు.
ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి, ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభలోకి తీసుకుని రాగలిగితేనే వాళ్ల సమస్యలు రెప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా ఈ టిప్పర్ డ్రైవర్ వృత్తి చేసుకుంటున్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు అన్నీ ఓ కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్లు పడుతున్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు.. జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇచ్చాడు అని ఇలా ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ, అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనే సరికే కాదు.. వేలి ముద్రగాడు అని కూడా అనేశారు చంద్రబాబు.
నేను అడుతున్నా ఇదే చంద్రబాబు నాయుడుగారిని.. అవునయ్యా.. జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీటు ఇచ్చాడు. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతున్నా. నిజంగా నువ్వు చేయలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తున్నా. నిజంగా నీకు, నాకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ అని ఒక వైపున చెబుతూ, మరో వైపున నిజంగా ఈరోజు గర్వపడుతున్నా. ఎందుకు తెలుసా? సొంత ఆటోలు కొనుక్కుని, ఈరోజు ట్యాక్సీలు కొనుక్కుని నడిపేవారు ఎంత మందో తెలుసా? అక్షరాలా 3,93,655 మంది.
తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ల మీద ఆధారపడకుండా.. చదువుకున్న వాళ్లే వీరంతా కూడా. కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్లే వీళ్లంతా. వీళ్లంతా కూడా ముందుకు వచ్చి ఎవడో ఉద్యోగం ఇవ్వలేదనో, ఎవడో తోడుగా ఉండటం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కకుని, సొంత ట్యాక్సీ కొనుక్కుని తమ కుటుంబాలను పోషిస్తున్న వారు అక్షరాలా 3,93,655 మందికి.. మొట్ట మొదటి ప్రభుత్వం.. వాళ్లు ఉన్నారు అని గమనించి, వాళ్లకు తోడుగా, అండగా ఉంటూ వాళ్లను ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఈ రెండూ చేపిస్తే తప్పనిచ్చి ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే రూ.10 వేలు ఇన్సూరెన్స్ కోమని, రిపేర్ల కోసం అయినా గానీ ఖర్చు పెట్టి.. ఆ రూ.10 వేలు ముందే జమ చేసి, ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్పనిచ్చి ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు.
మరి ఈ మాదిరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తూ కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్లందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా, అండగా ఉంది అని చెబుతూ ఏకంగా 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంత మంది మళ్లీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ల వెహికల్స్ అన్నీ కూడా. కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.10 వేలు ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాల్లో రూ.50 వేలు తీసుకున్న వాళ్లు ఎంత ఇచ్చామో తెలుసా.. ఈ 3,93,655 మందికి.. వాళ్ల కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం రూ.10 వేలు ఇస్తూ 5 సంవత్సరాల్లో 50 వేలు పొందిన వారు కూడా ఇందులో ఉన్నారు.
మొత్తంగా రూ.1,296 కోట్లు వీళ్లకు ఇచ్చాం. మరొక్క సారి చెబుతున్నాను. వాహన మిత్ర అనే స్కీము తీసుకొచ్చి సొంత ట్యాక్సీ గానీ, సొంత ఆటో గానీ కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న సొంతంగా చేసుకుంటున్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 58 నెలల కాలంలో రూ.1.296 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట చెబుతున్నా. నెక్స్ట్ మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కుని, సొంతంగా లారీలు కొనుక్కుని వాళ్ల జీవనం వాళ్లు నడిపించుకుంటున్న వాళ్లను కూడా ఈ జాబితాలోకి తీసుకుని వస్తాం అని ఈ సందర్భంగా చెబుతున్నా.
వీళ్లందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో తెలుసా? కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్లంతట వీళ్లు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మామూలుగా ఉన్న మిగిలిన వాళ్లందరికీ కూడా మన నవరత్నాల్లోని అన్ని పథకాలూ ఎలాగూ వాళ్లందరికీ కూడా అందుతున్నాయి. అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే, వారింట్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్లింట్లో ఉన్న పెద్దవాళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతున్నాయి. ఈరోజు మీ అందరితో ఈ వేదికపై నుంచి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందాం అని అనుకుంటున్నాను. మైకు మీకు ఇస్తాను. మీ తరఫు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మైకు నేరుగా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
ఈ జిల్లాలో ఈ మాదిరిగా వాహన మిత్ర పొందుతున్న వాళ్లు ఎంత మందో తెలుసా? ఈ జిల్లాలో ఏకంగా 18,000 కుటుంబాలు వాహన మిత్ర పొందుతున్నారు. ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది రూ.61 కోట్లు. ఈ 7 సెగ్మెంట్లలోనే ఇవ్వడం జరిగింది. అని సీఎం జగన్ తెలిపారు.
ఇవీ చదవండి: PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
YS Jagan in Puthalapattu: రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ ఎవరెవరికి ఎంత అందించామంటే.. పూతలపట్టులో సీఎం జగన్
