HomeAndhra PradeshCM Jagan Bharosa: పెరాలసిస్‌ బాధితుడికి సీఎం జగన్ కొండంత భరోసా

CM Jagan Bharosa: పెరాలసిస్‌ బాధితుడికి సీఎం జగన్ కొండంత భరోసా

CM Jagan Bharosa: ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తనను కలిసిన వారిని సీఎం జగన్ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. బాధతో వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఓదారుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది.

చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం. అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేసారు.

మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది.

ఇవీ చదవండి: YS Jagan in Kadiri: కదిరిలో జగన్నామ స్మరణతో హోరెత్తిన జనసంద్రం
YS Jagan on CBN: అవ్వాతాతలకు నష్టం జరుగుతుందని ఆలోచన చేయని చంద్రబాబు
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌
YSR EBC Nestham: మళ్లీ అవే పొత్తులు.. అవే అబద్ధాలు.. మోసపోకండి..: ఈబీసీ నేస్తం నిధుల విడుదలలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు