Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోత బారిన పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇలా వేడి ఉంటే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట సైతం ఉక్కపోత ఉంటుండడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత, వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. నిన్న నంద్యాలలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సుమారు 15 జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీస్తాయని ఐఎండీ అధికారులు జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇవీ చదవండి: AP Weather Report: ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరిక.. నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలి..
Tourist places: వసంత కాలంలో ఈ ప్రదేశాలకు వెళ్లడం మిస్ అవకండి!
Watermelon: చల్ల చల్లగా.. ఈ సమ్మర్‌లో తియ్యటి రిఫ్రెషింగ్ పండు పెచ్చకాయ!
