Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది చంద్రబాబేనని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని (పేర్ని వెంకట్రామయ్య) విమర్శించారు. తాడేపల్లి వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పేదలను ఓటు బ్యాంకుగానే చూశారని పేర్ని నాని మండిపడ్డారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..
“చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. బాబు 14 ఏళ్లలో పేదల కోసం ఒక్క పథకం కూడా పెట్టలేదు. నిమ్మగడ్డ ఎవరో ప్రజలకు తెలియదా? నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలిసిందే.
వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతామని గతంలో పవన్ అన్నారు. పథకాలను వాలంటీర్లు ప్రజలకు అందించకుండా అడ్డుకున్నది చంద్రబాబు కాదా? సీఈసీ వద్ద పైరవీ చేసినవాళ్లు ఎవరు? దివ్యాంగులకు ఇంటికెళ్లి డబ్బులిద్దామనే ఆలోచన బాబుకు ఎందుకు రాలేదు? టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారట. వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు వచ్చేలా చేస్తానని బాబు అంటున్నారు.
భయంతోనే వాలంటీర్ల పట్ల చంద్రబాబు మాట మార్చారు. పెన్సన్లు ఇవ్వకుండా ఆపడం చంద్రబాబు వల్ల కాదు. ఎన్టీఆర్, హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రామ్మూర్తి నాయుడును చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు.
చంద్రబాబు గురించి త్వరలో పవన్ కూ తెలుస్తుంది. పిఠాపురంలో పవన్ ఇల్లు కట్టుకుంటానంటాడు జలుబు చేస్తే మాత్రం హైదరాబాద్ వెళ్తాడు. జనసేన జెండా మోసినవారిలో పవన్ ఎంతమందికి టికెట్ ఇచ్చారు. జనసేన పోటీ ఇస్తున్న 21 స్థానాల్లో టీడీపీ నేతలకు టికెట్లు ఇచ్చారు. సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం విషపు కూటమి చేస్తోంది. ఇంటింటికీ బియ్యం వద్దని ఈసీకి టీడీపీ లేఖ ఇచ్చింది.” అని పేర్ని నాని కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి: Bus Yatra: వైయస్ జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్ ఇదీ..
YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్.. బస్సు యాత్రతో వైయస్సార్ సీపీలో జోష్!!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
