Tourist places: ఎండ కాలం భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో వసంత రుతువు ఆగమనం ఉగాది పండుగ నుంచి రాబోతోంది. వసంత కాలంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లడం ద్వారా ఆహ్లాదాన్ని పొందవచ్చు. మనకు కొన్ని ప్రదేశాలను చూస్తుంటే ఎంతో హాయి కలుగుతుంది. మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలనిపిస్తుంది. వేసవి కాలంలో కళాశాలలు, పాఠశాలలకు సెలవులు కావడంతో కుటుంబం అంతా కలిసి మంచి పర్యాటక ప్రాంతానికి టూర్ వేసుకోవచ్చు. మండు వేసవిలో అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
మేఘాలయలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతం ఉంటుంది. అక్కడ మంత్రముగ్ధమైన అనుభూతి కలుగుతుంది. వసంతకాలంలో షిల్లాంగ్‌లో ఆర్కిడ్ పువ్వులు వికసిస్తాయి. ఆర్కిడ్ ఫ్లవర్ ఫెస్టివల్‌ను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు షిల్లాంగ్‌కు వెళ్తుంటారు.
శీతాకాలం ముగిసి, వేసవి కాలం మొదలయ్యే కొద్దీ మంచు క్రమంగా కరిగిపోతుంది. అందుకే ఒడ్డున ప్రవహించే నదులు, రంగురంగుల పూలతోటల దృశ్యం ప్రకృతి ప్రేమికులకు కట్టిపడేసేలా ఉంటుంది.
దక్షిణ భారతదేశంలోని కర్ణాటక కాఫీ సాగుకు ప్రసిద్ధి చెందింది. వసంతకాలంలో కాఫీ సాగు ఎక్కువగా ఉంటుంది. కొండల్లో కాఫీ పూల సువాసనతో వాతావరణం ఎంతో హాయిగా అనిపిస్తుంది.
మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులోని ఊటీ. నీలం రంగు పర్వతం నీలగిరి. పర్వతాల సుందరమైన అందాలను చూడటానికి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఊటీని సందర్శించాలి. చాలా మంది ట్రెక్కర్లు ఇక్కడకు జంగిల్ సఫారీ కోసం చేరుకుంటారు.
కేరళ రాష్ట్రంలోని మున్నార్‌కు వెళితే చక్కటి అనుభూతి కలుగుతుంది. భగవంతుని భూమిగా కేరళ పేరు పొందింది. కేరళ ప్రకృతి సౌందర్యం వసంతకాలంలో మంత్రముగ్దుల్ని చేస్తుంది. అలాగే వర్షాకాలంలోనూ అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. లోయలలో పక్షుల కిలకిలారావాలు, వికసించే అడవులను చూసేందుకు ఈ వసంతకాలంలో కేరళ టూర్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
ఇక కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోనూ ప్రకృతి అందాలు బాగా ఉన్నాయి. వసంతకాలంలో భారతదేశ స్వర్గధామంగా పిలిచుకునే కశ్మీర్‌ను తప్పకుండా సందర్శించాలి. వసంత కాలంలో కశ్మీర్‌లో చెట్లకు పూలు పూస్తాయి. ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి కశ్మీర్ మంచి డెస్టినీ.
ఇవీ చదవండి: World tourism day 2023: టూరిజంలో నంబర్ వన్ అవుదాం.. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి రోజా
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ
Everest: ఎవరెస్ట్ పర్వతారోహకులకు వింత అనుభవాలు.. మల వ్యర్థాలతో కంపు కొడుతున్న మంచుకొండలు!
