HomeNationalVote: ఓటు వేసేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత

Vote: ఓటు వేసేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత

Vote: ఓటు వేసేందుకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఓటు వేయడానికి ఓటర్లకు ఆధార్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధన ఏమీ లేదని వెల్లడించింది. ఆధార్‌ లేకపోయినా ఓటు వేయొచ్చని పేర్కొంది. ఓటరు కార్డు కానీ, లేదంటే చెల్లుబాటు అయ్యే మరేదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని ఈసీ తెలిపింది.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో వేల సంఖ్యలో ఆధార్‌ కార్డులను పనికిరాకుండా చేస్తున్నారంటూ తృణమూల్‌ ఎంపీలు ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికల కమిషనర్‌ స్పష్టత ఇచ్చారు. ఆధార్ కార్డు లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని టీఎంసీ బృందానికి వెల్లడించారు.

ఇవీ చదవండి: AP Voters: ఏపీలో 4.08 కోట్ల మంది ఓటర్లు.. కొత్త ఓటర్లు చేరితే మరింత పెరిగే అవకాశం!
Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..
TDP Janasena BJP: పొత్తు కుదిరిన వేళ.. ఓటు బదిలీపై కూటమి పార్టీల బెంగ..!
Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు