World tourism day 2023: టూరిజంలో నంబర్‌ వన్‌ అవుదాం.. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి రోజా

World tourism day 2023: టూరిజంలో వచ్చే ఏడాదికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌ అయ్యేలా పని చేద్దామని మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. మన నేచర్‌ మన టూరిజానికి ప్యూచర్‌ అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. (World tourism day 2023)

* టూరిజం, పర్యావరణహిత పెట్టుబడులు అనే థీమ్‌తో ముందుకు వెళుతున్నాం.
* శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లేపాక్షి గ్రామం 2023లో భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంలో ఒకటిగా సిల్వర్‌ కేటగిరీలో ఎంపిక కావటం రాష్ట్రానికి గర్వకారణం.
* గతేడాది మన రాష్ట్రం పర్యాటక ర్యాంకింగ్‌ లో మూడవ స్థానం సాధించింది.
* వచ్చే ఏడాది మొదటి స్థానం సాధించటానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం.

* పర్యాటక రంగంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా పెట్టుబడులను, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్వర్యంలో పర్యాటక శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
* మన రాష్ట్రానికి ఘనమైన చరిత్ర, ప్రశాంతమైన బీచ్‌ లు, వన్యప్రాణుల అభయారణ్యాలు, హిల్‌ స్టేషన్లు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పర్యాటక పరంగా ఆణిముత్యం.

* బంగాళాఖాతం వెంట 972 కిలోమీటర్ల సముద్రతీరాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో వైజాగ్, రుషికొండ వంటి బీచ్‌లతో పాటు ఎన్నో పర్యాటక బీచ్‌లు ఉన్నాయి.
* ఇక్కడ ప్రకృతి సౌందర్యం, సీ ఫుడ్స్, నీటి క్రీడా కార్యకలాపాలు పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటున్నాయి.
* కొత్త టూరిజం పాలసీ 2020–25 లో భాగంగా ఇన్వెస్టర్లకు మార్గనిర్దేశం చేయటానికి ఇన్వెస్టర్‌ ఫెసిలిటేషన్‌ సెల్‌ ఏర్పాటు చేశాం.
* ప్రతిష్టాత్మక ఒబెరాయ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ వంటి పెట్టుబడిదారులు ముందుకు వచ్చి మన రాష్ట్రంలో ఐదు ప్రదేశాల్లో 7–స్టార్‌ హోటల్‌ సదుపాయాలతో లగ్జరీ హోటల్స్‌ ను ఏర్పాటు చేస్తున్నాయి.

* ఇటీవలే గండికోట, విశాఖపట్నం, తిరుపతి లో మూడు చోట్ల సీఎం జగన్‌ శంఖుస్థాపన చేశారు.
* ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 ద్వారా 117 టూరిజం ప్రాజెక్ట్‌ ల ఏర్పాటుకు రూ.19,514.86 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. 50,133 మందికి ఉపాధి కల్పన జరిగనుంది.

Read Also : Progressive Andhra Pradesh: ఏపీ స్థూల ఉత్పత్తి శరవేగం.. సంక్షేమ వెల్లువతో పెరిగిన తలసరి ఆదాయం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles