Andhra Pradesh Pensions: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లను ఎన్నికల పనులకు దూరంగా ఉంచాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబుకు అనుకూలంగా ఉండే నిమ్మగడ్డ రమేష్ వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరమయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాలంటీర్లను నగదు కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీలో సుమారు 66 లక్షలమంది పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో వాలంటీర్లు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్లు తమ చేతిలో పెట్టేవారని, ఇప్పుడు టీడీపీ కుట్రల వల్ల తమకు పెన్షన్ అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. అయితే, పెన్షనర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, వాలంటీర్ల స్థానంలో సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఏప్రిల్ 3వ తేదీన అందిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారంటే..
“పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తాం. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి. మూడో తేదీన పెన్షన్లు అందిస్తాం. ఒక మంచి వ్యవస్థపై కక్ష కట్టారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటింటికీ అందిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థ మీద మొదటి నుంచి చంద్రబాబుకు కక్ష పెంచుకున్నారు. వాలంటీర్లు సీఎం జగన్ కు మేలు చేస్తారని చంద్రబాబుకు భయం పట్టుకుంది.
చంద్రబాబుది మోసపూరిత రాజకీయం. నిమ్మగడ్డ రమేశ్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే. ఒక రాజకీయపార్టీ వ్యవహరించే తీరు ఇదేనా. చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. వాలంటీర్లపై చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతున్నారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు. తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు. ఓట్ల కోసం వ్యవస్థను పెడితే అది ఫెయిల్ అవుతుంది.
వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి. చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు. వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది? చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు. తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని, పవన్ ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్ కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు.” అని సజ్జల వ్యాఖ్యానించారు.
పింఛన్ల పంపిణీపై అధికారులకు సెర్ప్ ఉత్తర్వులు
ఏపీలో పెన్షన్ల పంపిణీపై సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులకు పలు సూచనలు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ జరుగుతుందని సెర్ప్ పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని సెర్ప్ స్పష్టీకరించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని పేర్కొంది. పింఛను లబ్దిదారులు ఆధార్, లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్ సూచించింది.
ఇవీ చదవండి: Bus Yatra: వైయస్ జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్ ఇదీ..
Tadikonda: తాడికొండలో గెలిచేదెవరు? నిలిచేదెవరు? తెనాలి శ్రావణ్ కుమార్ వర్సెస్ మేకతోటి సుచరిత
Siddham Rapthadu: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో.. సైకిల్ బయటే.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి
