HomeNationalYour Vote: మీ ఓటు ఎక్కడుంది? తెలుసుకోవడం ఎలా.. పీడీఎఫ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Your Vote: మీ ఓటు ఎక్కడుంది? తెలుసుకోవడం ఎలా.. పీడీఎఫ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Your Vote: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరూ ఓటు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. అసలు మీ ఓటు ఎక్కడుందో తెలుసుకునే వీలు కల్పించింది ఈసీ. మన ఓటు ఏ ప్రాంతంలో ఉంది, అసలు ఉందా? లేదా అన్న వివరాలను ఆన్ లైన్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చు. దీని కోసం సీఈఓ ఓటర్ లిస్ట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా, మీరు సీఈఓ ఓటరు జాబితాను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు దర్శనం ఇస్తుంది. ఓటరు జాబితాలో మీ పేరు చూడటానికి మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి లేదా మీసేవ కేంద్రాలకు గానీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంటర్నెట్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ప్రతి రాష్ట్ర ఓటర్ల జాబితా ఆ రాష్ట్ర సీఈవో లేదా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఓటరు లిస్టులో మీ పేరు ఇలా వెతకాలి..
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in లోకి మొదట వెళ్లాలి. హోమ్ పేజీలో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓటరు జాబితాలో వెతకాలి. ఇప్పుడు డిస్క్రిప్షన్ ద్వారా సెర్చ్ లేదా ఐడెంటిటీ కార్డ్ ద్వారా సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అనంతరం మీ పేరు, వయసు, పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా మొదలైన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఎంటర్ చేయాలి. అనంతరం సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓటరు జాబితాలో మీ పేరును వెతకొచ్చు.

ఈ-ఎపిక్ ఇలా డౌన్‌లోడ్ చేయాలి
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in/ ను సందర్శించాలి. హోమ్ పేజీలో ఈ-ఎపిక్ డౌన్లోడ్ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఎపిక్ నంబర్ లేదా రిఫరెన్స్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం మీరు మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎపిక్ మీకు కనిపిస్తుంది. డౌన్‌లోడ్ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. తద్వారా మీరు ఎపిక్‌ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

ఏపీకి చెందిన ఓటర్లు తమ వివరాలు, జాబితాల కోసం https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అదే తెలంగాణ ఓటర్లయితే జాబితా కోసం https://ceotelangana.nic.in/ వెబ్ సైటు లోకి వెళ్లాలి.

పీడీఎఫ్ డౌన్ లోడ్ ఇలా..
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in/ ను సందర్శించాలి. హోమ్ పేజీలో మీరు ఓటరు రోల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓటర్ల జాబితా పీడీఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి. అనంతరం గో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రాష్ట్రం, ఎల్ఏసీ, పోలింగ్ స్టేషన్, మదర్ రోల్ / సప్లిమెంట్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం వ్యూ రోల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓటర్ల జాబితా మీకు కనిపిస్తుంది. అనంతరం డౌన్‌లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు ఓటరు జాబితా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవీ చదవండి: Vote: ఓటు వేసేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
AP Voters: ఏపీలో 4.08 కోట్ల మంది ఓటర్లు.. కొత్త ఓటర్లు చేరితే మరింత పెరిగే అవకాశం!
Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు