Google Pay: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నగదు చేతిలో లేకపోయినా స్మార్ట్ ఫోన్, బ్యాంకు బ్యాలన్స్ ఉంటే చాలు.. ఎలాంటి లావాదేవీలైనా ఇట్టే చేసేసుకోవచ్చు. డిజిటల్ మనీ రూపంలో మనకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, యూపీఐ లాంటి పేమెంట్ యాప్స్ వచ్చాయి. అందులో నిరభ్యంతరంగా లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే, ఒక వేళ మన ఫోన్ ఎక్కడైనా తస్కరించబడిందనుకోండి.. అలాంటి సమయాల్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలలో ఉన్న డబ్బును ఎలా రక్షించుకోవాలనే సందేహం చాలా మందికి ఉంటుంది.
త్వరగా చెల్లింపుల కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సహా పలు రకాల యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అయితే, ఫోన్ పోయినప్పుడు అందులోని కీలక సమాచారంతో పాటు.. యూపీఐ యాప్స్ కూడా దుర్వినియోగమయ్యే చాన్స్ ఉంటుంది. అలాంటి సమయాల్లో వెంటనే ఎలా బ్లాక్ చేయాలి? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నది అందరూ తెలుసుకోవాలి.
టెంపరరీగా పేటీఎం బ్లాక్ చెయ్యడం..
* హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 01204456456 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి.
* ఆప్షన్ ఎంచుకోవాలి. కాల్ చేసిన సమయంలో లాస్ట్ ఫోన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* నంబర్‌ను ఎంటర్ చేయాలి. వేరే నంబర్‌ను నమోదు చేయాలనే ఆప్షన్ ఎంచుకుని.. మీ ఫోన్ పోగొట్టుకున్న నంబర్ ఎంటర్ చేయాలి.
* అన్ని చోట్లా లాగౌట్ చేయాలి. ప్రతి డివైజ్ నుంచి లాగౌట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
* మరింత సహాయం కోసం పేటీఎం వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 24/7 సహాయాన్ని ఎంచుకుని.. మీకు జరిగిన మోసాన్ని వివరించాలి. అకౌంట్ ను తాత్కాలికంగా బ్లాక్ చేయడానికి అవసరమైన ప్రూఫ్‌లను సమర్పించాలి.
గూగల్ పే బ్లాక్ చెయ్యడానికి..
*కస్టమర్ సర్వీస్ కాల్ చేయాలి. అకౌంట్ బ్లాక్ చేసేందుకు సర్వీస్ సెంటర్ 18004190157 కు కాల్ చేయండి.
* సూచనలను పాటించాలి. గూగుల్ పే ను బ్లాక్ చేయడానికి కస్టమర్ సర్వీస్ సూచనలు ఫాలో అవ్వండి.
* రిమోట్ వైప్ – ఐవోఎస్ యూజర్లు ఎలా అయితే తమ డేటాను తొలగించుకోవచ్చో.. ఆండ్రాయిడ్ యూజర్లు కూడా తమ డేటాను రిమూవ్ చేయవచ్చు.
ఫోన్ పే బ్లాక్ చెయ్యడం..
* కస్టమర్ సర్వీస్ కాల్.. ఫోన్ పే బ్లాక్ కోసం కస్టమర్ సర్వీస్ సెంటర్ 08068727374 లేదా 02268727374 నెంబర్ కు కాల్ చేయండి.
* సమస్యను చెప్పాలి. మీ ఫోన్ పే అకౌంట్ సమస్యను వివరించండి.
* ఓపీపీ నిర్ధారణ. ఓటీపీ సెండ్ చేసినప్పుడు.. ఎలాంటి ఓటీపీ రాలేదనే ఆప్షన్ ను ఎంచుకోండి
* నష్ట నివేదిక – ఫోన్ పే అకౌంట్ ను బ్లాక్ చేయడానికి కావాల్సిన అన్ని వివరాలను అందించాలి.
ఫోన్ పోవడం వల్ల వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన సమాచారం దుర్వినియోగం అయ్యే చాన్స్ ఉంటుంది. ఆర్ధిక నష్టాన్ని తగ్గించుకోవడానికి ఈ యాప్స్ ను తప్పకుండా బ్లాక్ చేయాలి.
కొన్ని యాప్స్ రిమోట్ బ్లాకింగ్స్ కోసం తమ వెబ్ సైట్స్ కోసం లేదా దానికి సంబంధించిన అకౌంట్స్ వాడకంలో ఉంటాయి. ఇందుకోసం ఆయా సంస్థల వెబ్ సైట్ లను సందర్శించాలి. ఈ డిజిటల్ యుగంలో మన ఆర్ధిక డేటాను భద్రపరుచుకోవడం కీలకం. ఫోన్ పోయిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్యూరిటీ కోసం బయోమోట్రిక్, పిన్ కోడ్స్, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.
ఇవీ చదవండి: Realme 12+ 5G: ఇండియా మార్కెట్‌లోకి రియల్ మీ 12 5జీ ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
Mobile Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్ చేస్తున్నారట!!
Phone beside Bed: బెడ్ పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?
Phone Hacking: ఫోన్ హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. తప్పక తెలుసుకోండి
