AP CID on CBN: మాజీ సీఎం చంద్రబాబు ఐటీ స్కామ్‌పై ఏపీలో జోరుగా రాజకీయ రచ్చ నడుస్తోంది. చంద్రబాబు రూ.118 కోట్ల ఐటీ స్కామ్‌పై నోటీసుల నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. ఐటీ స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణాల మూలాలు ఒకే చోట ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో, రెండు స్కామ్‌లలో అదే వ్యక్తులు ఉండటంపై విచారణకు రెడీ అయ్యింది. (AP CID on CBN)
ఈ నేపథ్యంలో ఐటీ స్కామ్‌లో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేశ్ పార్థసాని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిందితుడు యోగేష్ గుప్తాకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి.. కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి.
నాలుగేళ్లుగా ఈ వ్యవహారంపై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్‌లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు కుంభకోణాల్లో భారీగా డబ్బులు ముట్టినట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై అభియోగాలు మోపింది.
రెండు స్కామ్‌లలో డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ స్కామ్‌లో ఉన్నవారి మధ్య సంబంధాలపై సీఐడీ ఫోకస్ పెట్టింది. దుబైలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి సారించనుంది. త్వరలో దుబైకి విచారణ బృందం వెళ్లనున్నట్లు సమాచారం.
Read Also : IT Notice to CBN: చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు.. ఇప్పటి వరకు రియాక్షన్ లేదెందుకు? తేలుకుట్టిన దొంగేనా?