Tulasi Kashayam: మన పూర్వీకుల నుంచి తులసికి విశేష ప్రాధాన్యం ఉంది. తులసి మన సంప్రదాయాల్లోనే కాదు.. దివ్యౌషధంగానూ ఎంతో ప్రాముఖ్యం ఉంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి కాలానుగుణంగా సంక్రమించే వ్యాధుల నివారణలోనూ తులసి బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల అనేక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చుట్టుముట్టిన సమయంలో వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ భద్రంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మంచి ఔషధ గుణాలున్న తులసి కషాయం చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి జబ్బులను నివారించడంలో తులసి అత్యుత్తమంగా పని చేస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ముఖ్యంగా తులసి అకులతో చేసే కషాయాన్ని తీసుకోవడం చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలోని పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలోనూ సాయపడతాయి.
తులసి కషాయాన్ని పరగడుపున తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు. తులసి ఆకులను పచ్చిగా తీసుకోవడం కంటే దాన్ని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
జీర్ణ శక్తి పెరుగుదల
తులసి ఆకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది వేగవంతమైన జీవక్రియతో పాటు సమర్థవంతమైన క్యాలరీలు కరిగించేందుకు సాయపడుతుంది. బరువు నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది
ఒత్తిడిని తగ్గించడంలో తులసి కషాయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక యాంటీ యాంగ్జయిటీ సామర్థ్యం ఉంటుంది. తులసిలో ఓర్పును పెంచే గుణం అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆందోళన నుండి ఉపశమనం కలిగించడంలో తులసి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు ఒత్తిడి అదుపులో ఉంచుకోవడం కీలకం.
వెయిట్ లాస్ కావాలనుకునే వారు, బరువును కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునేవారికి ఇన్సులిన్ నిరోధకం చాలా ముఖ్యమైనది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నందున ఇవి ఇన్సులిన్ నిరోధకతకు సాయపడతాయి.
అల్లం, జీలకర్ర, సోపు లాంవంటి వాటితో తులసి కషాయం తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగయ్యేలా చేస్తాయి. పోషకాలను గ్రహించడంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది.
తులసి కషాయం చేయడానికి ఏమేం కావాలంటే..
* 10-12 తాజా తులసి ఆకులు తీసుకోవాలి
* ఒక అంగుళం అల్లం (తురిమినది)
* జీలకర్ర గింజలు 1 టీ స్పూన్
* ఓ టీ స్పూన్ సోపు గింజలు
* నల్ల మిరియాలు రెండు
* దాల్చిన చెక్క కొంచం
* 4-5 కప్పుల నీళ్లు
తయారు చేయడం ఇలా..
* కప్పు నీటిని వేడి చేయాలి
* తులసి ఆకులను (సుమారు 10-15) నీటిలో వేసి, మరిగించాలి
* మరిగిన తర్వాత, మంటను తగ్గించి 15 నిమిషాల పాటు మరిగించాలి
* తులసి ఆకులను తొలగించి, నీటిని వడకట్టాలి
* రుచి కోసం, తాజాగా రుబ్బిన చక్కెర లేదా తేనెను వినియోగించుకోవాలి
* 4-5 కప్పుల నీటిని బాగా మరిగించాలి.
* నీరు మరిగే తర్వాత, తులసి ఆకులు, తురిమిన అల్లం, జీలకర్ర, సోపు గింజలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్కలను వేసుకోవాలి.
* మరిగిన తర్వాత మంటను తగ్గించి, 15 నిమిషాల పాటు మరిగించాలి
* తులసి ఆకులను తొలగించి, నీటిని వడకట్టాలి.
* వడకట్టిన తులసి కషాయాన్ని కప్పులో పోసుకుని గోరు వెచ్చగా తీసుకోవాలి.
ఇవీ చదవండి: Tulasi Chettu: ఔషధ గుణాల తులసిచెట్టు.. తులసి ఆకులు, మొక్కతో ఎలాంటి ఉపయోగాలున్నాయంటే..
Tulasi Vastu Tips: తులసి చెట్టును ఇంట్లో ఏ దిక్కులో పెట్టాలి?
Volunteers Meeting: జన్మభూమి కమిటీలు, మన వాలంటీర్లు.. తేడా గమనించండి.. : సీఎం జగన్
