తులసి మొక్కను (Tulasi Vastu Tips) హిందువులు దేవతగా కొలుస్తారు. తులసికి ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. పురాణాల్లోనూ తులసి (Tulasi Vastu Tips) చెట్టును లక్ష్మీదేవతగా పూజించిన చరిత్ర ఉంది. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుకు తులసిని (Tulasi Vastu Tips) నైవేద్యంగా సమర్పిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలతో పూజించడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల సిరిసంపదలతో తులతూగుతారని విశ్వాసం.
1. పూజల్లోనే కాదు.. ఆయుర్వేదంలోనూ తులసికి ప్రాధాన్యం ఎక్కువే ఉంది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
2. ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా రక్షణగా ఉంటుంది.
3. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు తులసి మొక్కను ఇంటికి ఏ దిక్కును పెట్టుకోవాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది.
4. తులసిని రాంగ్ డైరెక్షన్ లో పెట్టుకుంటే కోరి కష్టాలు తెచ్చుకుట్లవుతుంది. వాస్తు శాస్త్రంలో తులసిని ఇంటికిక ఏ దిక్కులో పెట్టుకోవాలో తెలియజేశారు.
5. ఎప్పుడు పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో వివరించారు. వాస్తు పండితులు చెప్పిన ప్రకారం.. తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి.
6. దీని వల్ల శుభాలు కలుగుతాయి. తూర్పు దిశలో స్థలం లేని వారు, వీలు కాని వారు.. ఈశాన్య మూలను ఎంచుకోవచ్చు.
7. పండితులు చెప్పిన ప్రకారం తులసి మొక్కను ఇంట్లో నాటుకొనేందుకు కార్తీక మాసం ఉత్తమంగా భావిస్తారు.
8. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది కాబట్టి తులసి మొక్క లేని వారు అందరూ తమ ఇళ్లలో తూర్పు దిశలో నాటుకోవాలని సూచిస్తున్నారు.
9. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్ర మాసం శుక్ర వారం రోజు కూడా తులసిమొక్క నాటేందుకు అనువైనదిగా చెబుతున్నారు.
వంట గది ఇలా ఉంటే దరిద్రం పట్టుకున్నట్లే..!
వంట గది వాస్తు ప్రకారం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇల్లు కట్టుకొనే విషయంలో ఎలా అయితే వాస్తు నియమాలు పాటిస్తారో.. వంట గది విషయంలో కూడా వాస్తు నియమాలు వర్తిస్తాయంటున్నారు. వంట గది నిర్మాణంలో వాస్తు పాటించడంతో పాటు అందులో సామాన్లు సర్దుకొనేటప్పుడు కూడా వాస్తు నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వంట గది అశుభ్రంగా ఉంటే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుందంటున్నారు. వంట గదిని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.
1. వంట గదిలో కుళ్లిపోయిన, పాడైపోయిన వస్తువులను ఎప్పుడూ ఉంచుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.
2. అలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదట. పురుగులు పట్టిన పిండి పదార్థాలు, పాడైపోయిన పచ్చళ్లు లాంటివి ఉంచుకోరాదు.
2. వంట గది మూలల్లో డస్ట్ బిన్లు, చీపురుకట్టలు కూడా ఉంచరాదట. ఎల్లప్పుడూ నీట్ గా, పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుందట.
3. కిచెన్ లో నిత్యం, గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. సామాన్లన్నీ ఇరుకుగా నింపుకొని పద్ధతి లేకుండా ఉంచుకోరాదని చెబుుతన్నారు.
4. వంట గదిలో బూజు పట్టకుండా చూసుకోవాలి. కంచాలు, వంట పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రంగా తోముకుంటూ ఉండాలి.
5. గిన్నెలనూ రోజుల తరబడి అలాగే ఉంచడం వల్ల దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుందంటున్నారు. అరిష్టం వస్తుందని సూచిస్తున్నారు.
6. వంట గదిలో నిత్యావసరాలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలట. అంటే ఉప్పు, పసుపు, పిండి, బియ్యం, ఆవనూనె లాంటి వస్తువులు నిత్యం ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
7. ఇవి అయిపోయిన చాలా రోజుల వరకు తెచ్చుకోకుండా అలాగే ఉంటే తీవ్రమైన ఆర్థిక కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
8. వంట గది సింక్ లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని చెబుతున్నారు.
Read Also : Silver Vastu Tips: వాస్తు దోషాలను వెండి వస్తువులతో పరిహరించండి