AP DCS Exam: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ-AP DSC) వాయిదా వేయాలని చాలా మంది నిరుద్యోగ యువత కోరుతున్నారు. ఇప్పటికే ఎన్నికల మూడ్‌లో రాష్ట్రం ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. 6100 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటఫికేషన్‌ను వెలువరించారు.
ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు సైతం చేసింది రాష్ట్ర విద్యా శాఖ. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. పలు కారణాల వల్ల పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
అయితే, డీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారు.. తమకు సమయం సరిపోవడం లేదని చెబుతున్నారు. కనీసం రెండు నెలల సమయం కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. ఈ మేరకు ఇవాళ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.. డీఎస్సీ పరీక్షల వాయిదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణ, వాయిదా వేయాలని కోరుతున్న వ్యవహారంపై రాష్ట్ర విద్యా శాఖను వివరణ కోరినట్లు తెలిపారు. డిపార్ట్‌మెంట్ నుంచి వివరణ రాగానే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామన్నారు. సీఈసీ నిర్ణయం మేరకు డీఎస్సీ వాయిదా వేయాలా, లేదా యథాతథంగా నిర్వహించాలా అనే దానిపై స్పష్టత ఇస్తామన్నారు.
ఈ నెల 30 తేదీ నుంచి జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వాయిదా వేయవద్దని మరికొందరు అభ్యర్థులు విస్తృత స్థాయిలో తమ కార్యాలయానికి మెయిల్స్ చేశారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ పరీక్షలకు దాదాపు 4.72 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఈ అంశానికి సంబందించి విద్యాశాఖ నుంచి వచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ద్వారా ఎన్నికల సంఘాని పంపించం జరుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనలపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు
Kalki 2898AD: ప్రభాస్ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Lok sabha elections: లోక్ సభ ఎన్నికలకు నగారా.. తొలి దశ నోటిఫికేషన్ జారీ
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
No Re poll: జీరో వయలెన్స్, నో రీపోల్.. ఇవే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశాలు..
