HomeAndhra PradeshAnakapalli Politics: అనకాపల్లిలో హాట్‌ హాట్‌ రాజకీయం.. వైయస్సార్‌ సీపీ ఎంపీ టికెట్‌ ఎవరికి దక్కేను?

Anakapalli Politics: అనకాపల్లిలో హాట్‌ హాట్‌ రాజకీయం.. వైయస్సార్‌ సీపీ ఎంపీ టికెట్‌ ఎవరికి దక్కేను?

Anakapalli Politics: అనకాపల్లి పార్లమెంట్‌ టికెట్‌ అధికార పార్టీ వైయస్సార్‌ సీపీ పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్‌ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి ఈ పార్లమెంటు స్థానం జిల్లాలో ప్రభావిత సామాజికవర్గంగా ఉన్న గవరలకు కేటాయించడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వ్యాపార వర్గంగా, ఆర్థికంగా అన్ని గ్రామాలలో గవర్లు చాలా ప్రభావిత సామాజిక వర్గంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటారు. Anakapalli Politics

కాగా వెలమ సామాజిక వర్గం వారు కూడా ఈ పార్లమెంట్ స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. ప్రస్తుతం తాజా మాజీగా ఉన్న డాక్టర్ భీశెట్టి సత్యవతి గవర సామాజిక వర్గం నుంచి వైయస్సార్‌ సీపీ అభ్యర్థిగా 2019లో పోటీ చేసి గెలుపొందారు. గతంలో సబ్బం హరి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

ఇక కొణతాల రామకృష్ణ విషయానికి వస్తే.. ఆయన గవర సమాజికవర్గం. మరోవైపు టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పెతకం శెట్టి నరసింహం కూడా గవర సామాజిక వర్గం వ్యక్తే. ఇలా ఇక్కడ భిన్నంగా ఎంపీ స్థానంలో ఎన్నిక అవుతూ వస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం టీడీపీ టికెట్ ఖరారు కాక అసంతృప్తితో ఉన్న పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వైయస్సార్‌ సీపీలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే ఈయన శ్రీకాకుళం ఎంపీ దివంగత ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకి స్వయానా పిల్లనిచ్చిన మామ కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

ఈ బంధుత్వం రీత్యా ఈయన పార్టీ మారే విషయం అంత తేలిక కాదంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టీడీపీ నుంచి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. ఆయన సీటు రాక తీవ్ర నిరాశలో ఉన్నారు.

గండి బాబ్జీ తమ్ముడు గండి రవికుమార్ తదితరులు ఇప్పటికే వైయస్సార్‌ సీపీలో చేరారు. గండి బాబ్జీ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన అభ్యర్థిత్వాన్ని కూడా అనకాపల్లి పార్లమెంటుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలమంచిలికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈయన గతంలో వైయస్సార్‌ సీపీలో ఉండేవారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. పెతకంశెట్టి సతీష్‌ కుమార్‌ విషయానికి వస్తే.. ఈయన గవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విశాఖ గాజువాక ప్రాంతంలో కిమ్స్ ఐకాన్ అధినేత డాక్టర్ పెతకం శెట్టి సతీష్ కుమార్.. ప్రముఖ ఆర్థోపెడిక్‌. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మునకపాక ఈయన సొంత ఊరు. ఈయన కూడా వైయస్సార్‌ సీపీ తరఫున అనకాపల్లి ఎంపీ టికెట్‌కు పోటీ నిలిచే అవకాశాలున్నాయి.

మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్‌ పేరును ఇక్కడ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం రమేష్‌ నాన్‌ లోకల్‌ కావడం ఇక్కడ మైనస్‌ అయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: YSRCP Candidates Final List: సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించాం: ముఖ్యమంత్రి జగన్
Gudivada Amarnath: ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల బరిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. గెలుపు వరిస్తుందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు