HomeAndhra PradeshEvaluation: ఏపీలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం షురూ.. ఏప్రిల్‌ 4న పూర్తి

Evaluation: ఏపీలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం షురూ.. ఏప్రిల్‌ 4న పూర్తి

Evaluation: ఏపీలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ కూడా నిన్ననే ప్రారంభమైందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. Evaluation

రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్, 2024 వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు.

1 నుండి 9 వ తరగతి వరకు తమ స్వంత పాఠశాల పరిసరాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు బోర్డు పరీక్షలు కొత్త అనుభూతిని కలిగించి, కొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తాయన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థులకు 100% బెంచ్ సీటింగ్, తాగునీటి కోసం RO ప్లాంట్లు, హై-ఎండ్ టాయిలెట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కొన్ని కేంద్రాల్లో ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వంటి ఆధునిక మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

మార్చి 2024లో జరుగుతున్న ఎస్సెస్సీ పరీక్షలకు నమోదు చేసుకున్న 7,25,618 మంది విద్యార్థులకు 30,234 గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పరీక్షలో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్ కూడా ఉంటుందన్నారు. సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధ విద్యార్థుల కోసం ఆడియో ప్రశ్నపత్రాలను ఫైలట్ ప్రాజెక్టుగా రూపొందించడం వినూత్నచర్యగా అభివర్ణించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న 12 మంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. భవిష్యత్ లో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఈ సౌకర్యం మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఫెయిల్ అయిన విద్యార్థులు, పాసైన విద్యార్థుల మధ్య వ్యత్యాసాన్ని మార్క్ షీట్లలో చూపించకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. గతేడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన 1,125 మంది విద్యార్థుల మార్కులను సబ్జెక్ట్ ల వారీగా పరిగణలోకి తీసుకొని మళ్లీ రెగ్యులర్ విద్యార్థులుగా నమోదుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఇవీ చదవండి: CS Review on NREGA: ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు చర్యలు
100 percent GER: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గ్రేట్‌ న్యూస్‌.. 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు