Sitting on Chair: వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది రోజులో ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డెస్కుల్లో పని చేసే వారు చాలా మంది రోజులో సుమారు 8-12 గంటలు కూర్చొనే ఉంటారు. ఇలా దీర్ఘకాలం కూర్చునే పని చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. Sitting on Chair
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం హవా నడుస్తోంది. చాలామంది ఆటలు ఆడటమే మానేశారు. చదువుకునేవారు, ఉద్యోగాలు చేసే వారు కూడా శారీరక శ్రమకు దూరమయ్యారు. రోజంతా కూర్చొనే గడిపేస్తున్నారు. ఇలాంటి జీవనశైలితో శారీరక, మానసిక ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజూ ఎలాంటి శారీరక శ్రమ లేకపోతే ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఎర్లీ డెత్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మానవ శరీరం నిత్యం కదిలే లాగా నిర్మితమైంది. ఎముకలు, కండరాలు, కీళ్ళు అన్ని కలిసి పనిచేస్తూనే ఉండాలి. నడవడం, పరిగెత్తడం, దూకడం, ఈత కొట్టడం వంటి వివిధ యాక్టివిటీస్ కలిగి ఉండాలి. రోజంతా నిలబడి లేదా చురుకుగా ఉండటం వల్ల గుండె పనితీరు, డైజెషన్ హెల్త్, మొత్తం ఎనర్జీ లెవెల్స్ మెరుగు అవుతాయి. శారీరక శ్రమ ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం అవుతుంది.
ఎక్కువగా కూర్చొని ఉండే వారికి మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నిరాశ, ఆందోళన పెరిగిపోతాయని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. సాధారణంగా శారీరకంగా చురుకుగా ఉంటే ఎన్నో మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒత్తిడి మాయం అవుతుంది. మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సుఖమైన నిద్ర పడుతుంది.
ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాల్ని జస్ట్ స్టాండ్ అనే సంస్థ వెల్లడించింది..
* తక్కువ ప్రమాదం: రోజుకు 4 గంటల కంటే తక్కువ కూర్చోవడం
* ఓ మోస్తారు ప్రమాదం: రోజుకు 4-8 గంటల పాటు కూర్చోవడం
* అధిక ప్రమాదం: రోజుకు 8-11 గంటలు కూర్చుంటే..
* చాలా ఎక్కువ ప్రమాదం: రోజుకు 11 గంటల కంటే ఎక్కువ కూర్చుంటే..
* సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పూర్ లైఫ్స్టైల్తో సంబంధం ఉన్న కొన్ని ఆరోగ్య ప్రమాదాలను తగ్గించుకోవడానికి వారానికి కనీసం 150 నిమిషాల మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలని పేర్కొన్నారు.
రోజంతా కూర్చొని పని చేసే వారి శరీరంలో లిపోప్రొటీన్ లిపేస్ వంటి అణువుల విడుదల గణణీయంగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ అణువులు కొవ్వులు, చక్కెరలను ప్రాసెస్ చేస్తాయి. ఇవి తగ్గితే బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు చేరుకుంటుంది. ఫలితంగా మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం ఎక్కువ అవుతుంది.
ఎక్కువ కూర్చునే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 112% అధికంగా ఉంటుంది. తక్కువ వ్యవధిలో బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే చాన్స్ ఉంది. ఇది మధుమేహం వచ్చేలా చేస్తుంది.
కార్యాలయాల్లో పని చేసేవారు ఎక్కువగా కూర్చోవడం మనం గమనిస్తుంటాం. అయితే దీనివల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. కొందరు ఉద్యోగుల హైపర్టెన్షన్ స్థాయిలు 2కి (140/90 mmHg కంటే ఎక్కువ) చేరుకునే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే ఎక్కువసేపు కూర్చుంటే ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్దపేగు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదం చాలా అధికమవుతుందని చెబుతున్నారు.
రోజులో చాలా సమయం కూర్చోవడం వల్ల డిప్రెషన్, ఆందోళన పెరుగుతాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఈరోజు వ్యాయామం చేయడం, వీలైనంత వరకు తక్కువ సమయం కూర్చోవడం, ఒక వేళ కూర్చోవాల్సి వస్తే గంటకోసారి కుర్చీ నుంచి లేచి అటూ ఇటూ తిరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Army Recruitment Rally: నవంబర్లో గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు పరిధిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Folding House: ధర రూ.21 లక్షలు.. అమెరికాలో ట్రెండింగ్లో ఉన్న మడత పెట్టే ఇళ్ల అమ్మకం
Office Chair: ఆఫీసులో ఏ దిశలో కూర్చోవాలి? వాస్తు ప్రకారం కలిసొచ్చే అంశాలివే..
