Amit Shah at Adilabad: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా ప్రసంగిస్తూ, కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. (Amit Shah at Adilabad)
“ఈ నేల మీద పుట్టిన కొమరంభీమ్ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈ వీర భూమికి నేను నమస్కరిస్తున్నా. బీజేపీని గెలిపించి కేసీఆర్ ను గద్దె దించండి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాం. డిసెంబర్ 3న బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మనం ఇక్కడ నినదిస్తే హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ కు వినపడాలి.
ట్రైబల్ యూనివర్సిటీని మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. పసుపు రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయబోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్ కూడా మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. మోదీ నేతృత్వంలో మహిళా బిల్లు కల నిజం చేశాం. పేదలు, మహిళలకు మేలు జరిగిందంటే అది మోదీ పాలనలోనే. గత 9 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం ఎంతో చేసింది.
ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు, పేదలకు ఒరింగిందేమీ లేదు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడింది. కేటీఆర్ ను సీఎం ఎలా చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఎన్నికలు రాగానే అందరు కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు. కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆదిలాబాద్ ఆదివాసీల కోసం కేసీఆర్ ఏం చేయలేదు.
కేసీఆర్ పేదల కోసం పనిచేయడం లేదు, కేవలం కొడుకు, కూతురు కోసమే పని చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు. కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ ను సీఎం చేయడమే. దళితులు, గిరిజనులకు కేసీఆర్ ఏమైనా చేశారా? రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానని కేసీఆర్ ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటారు. ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ గా చేశారు. తెలంగాణలో ఆధునిక రజాకార్ల నుంచి బీజేపీ మాత్రమే రక్షిస్తుంది.
అవినీతి, కుంభకోణాల్లో తెలంగాణను నెంబర్ వన్ చేశారు. తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నా నడిపించేదంతా మజ్లిస్ పార్టీనే. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది. దళితులకు మూడెకరాల హామీ ఏమైంది? దళిత బంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు.” అని అమిత్ షా మండిపడ్డారు.
ఇదీ చదవండి: CM Jagan with Amit Shah: అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. కృష్ణా జలాలు, పోలవరంపై చర్చలు