HomeAndhra PradeshJustice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

Justice for Geethanjali: తనకు ప్రభుత్వం తరఫున ఇంటి పట్టా వచ్చిందని ఓ యూట్యూబ్‌ చానల్‌లో చెప్పిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహిళ గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన సానుభూతిపరులైన వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఆమెపై విపరీతమైన, వ్యక్తిగత విమర్శలు, ట్రోలింగ్‌ చేయడమే ఆమె మరణానికి కారణమైందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై వివరాలు ఆరా తీసిన సీఎం జగన్‌.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. Justice for Geethanjali

ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగంకలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టపరంగా వదిలిపెట్టబోమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇటీవల ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పింది.

దీంతో ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు ఆమెపై అసభ్య పదజాలంతో దూషణలు, ట్రోలింగ్‌కు పాల్పడ్డారని, దీంతో ఆమె తీవ్రంగా మనస్తాపం చెందిన ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్‌
ONGC help: ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం చెల్లింపు
CM Jagan relesed ONGC Compensation: 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకున్నాం: సీఎం జగన్‌
Krishna River Retaining Wall: కృష్ణమ్మ జల విహార్‌.. రిటైనింగ్‌ వాల్‌ పూర్తితో కృష్ణలంక వాసుల కల సాకారం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు