RC16: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తన 16వ చిత్రం (#RC16)లో హీరోయిన్ ఖరారైంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రామ్ చరణ్‌కు జోడీగా జతకట్టనుంది. జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వెంటవెంటనే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది జాన్వీ కపూర్. ఇప్పటికే బాలీవుడ్‌లో బిజీగా సినిమాలతో గడిపేస్తోంది. మరోవైపు టాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు అవకాశాలు అందిపుచ్చుకుంది. తెలుగులో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ సరసన దేవర (Devara) మూవీలో యాక్ట్ చేస్తోంది.

మరో తెలుగు అగ్ర హీరో సరసన కూడా తదుపరి చిత్రంలో జాన్వీ కనిపించనుంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram charan) హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది.
RC16 అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో జాన్వీ నటించనుందని నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ ఈ విషయాన్ని నిర్ధారించింది. ప్రాజెక్ట్‌లోకి స్వాగతం పలికింది. ఇది తెలుగులో జాన్వీకు రెండో సినిమా కావడం విశేషం.

RC16 సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్రీడాంశం నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరోవైపు జాన్వీ ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ హీరోగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం ‘దేవర పార్ట్-1’ పేరుతో ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది.
ఇవీ చదవండి: KLIN KAARA: క్లీంకార.. రామ్ చరణ్, ఉపాసన తనయ పేరు ఇదే.. అర్థం తెలుసా?
Vyooham Teaser: అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు.. ‘వ్యూహం’ టీజర్‌తో అంచనాలు పెంచేసిన రామ్‌గోపాల్ వర్మ!
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫొటో గ్యాలరీ
Patanjali Foods: పతంజలి ఫుడ్స్‌కు ఎదురుదెబ్బ.. ఏకంగా 3.91 శాతం క్షీణించిన షేర్లు
