HomeNationalAmbani: అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ బాష్‌.. బాలీవుడ్‌ తారలంతా అక్కడే ఉన్నారుగా...!

Ambani: అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ బాష్‌.. బాలీవుడ్‌ తారలంతా అక్కడే ఉన్నారుగా…!

Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీన గుజరాత్‌లోని జామ్‌నగర్ శివార్లలో తమ వివాహానికి ముందు జరిగే వేడుకలకు (ప్రీ వెడ్డింగ్) ముందు గ్రామీణులకు సంప్రదాయ గుజరాతీ ఫుడ్‌ను వడ్డించారు. Ambani

వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల కోసం చార్టర్ జెట్‌లు, రిహన్న ప్రదర్శన, జంగిల్ ఫీవర్ దుస్తుల తళుకులు కనిపించాయి. ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్ ప్రకారం $114 బిలియన్ల నికర విలువ కలిగి ఆసియాలో అత్యంత సంపన్నుడుగాఉన్న సంగతి తెలిసిందే. అంబానీ ఎప్పుడూ ఇలా పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వడానికి మక్కకువ చూపడం తక్కకువగానే చూస్తుంటాం.

తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ (29)ని వివాహం చేసుకోబోతున్న అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(28) కోసం మూడు రోజుల వివాహానికి ముందు జరిగే జంబూరీ.. ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద ఈవెంట్‌గా చెబుతున్నారు. ఇది శుక్రవారం ప్రారంభం అవుతోంది. 1,200 మంది అతిథులను ఈ వేడుక ఎంతగానో అలరించనుంది. గుజరాత్‌లోని రిలయన్స్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారానికి సమీపంలోని జామ్‌నగర్‌లోని ఒక టౌన్‌షిప్‌లో ఈ వేడుక అత్యంత అట్టహాసంగా జరుగుతోంది.

జూలైలో వివాహం జరిగే అవకాశం ఉంది. బుధవారం అనంత్, వధువు స్థానిక గ్రామస్తులు 51,000 మందికి సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేశారు. పాప్, R&B సూపర్ స్టార్ రిహన్నతో పాటు, యూఎస్‌ ఇంద్రజాలికుడు డేవిడ్ బ్లెయిన్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సంప్రదాయ వేడుకలు కూడా నిర్వహిస్తారు.

హాజరు కానున్న దిగ్గజాలు..
మరోవైపు అనంత్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి దిగ్గజ బిల్ గేట్స్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేనా.. ఫేస్‌బుక్‌ అదినేత మార్క్ జుకర్‌బర్గ్, భారతీయ బిలియనీర్లు గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా, పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు హాజరు కానున్నారు.

ఇవీ చదవండి: ప్రపంచ కుబేరుల్లో ముఖేష్‌ అంబానీది ఎన్నో స్థానమంటే…
YS Jagan vs Chandrababu: చంద్రబాబు 14 ఏళ్ల పాలన వర్సెస్‌ జగన్‌ నాలుగున్నరేళ్ల పాలన.. ఎవరి హయాంలో ఏం జరిగింది?
Twitter: ట్విట్టర్‌ పిట్టను లేపేస్తున్న మస్క్‌ మావ! కొత్త లోగో ఇదే..
Andhra Pradesh: జీవీ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ.. ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్నారుగా..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు