Twitter: సోషల్ మీడియాలో ప్రముఖ స్థానం పొందిన ట్విట్టర్.. పక్షి లోగోతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. సోషల్ మీడియా రాజ్యంలో మెయిన్ రోల్ పోషిస్తోంది. ఇటీవల ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు ఎలన్ మస్క్. అనేక మంది ఉద్యోగులను, ఆఖరికి సీఈవోను సైతం నిర్దాక్షిణ్యంగా తీసిపడేశారు. తాజాగా ట్విట్టర్‌కు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన పిట్టను మస్క్ లేపేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పిట్ట స్థానంలో కొత్త లోగో త్వరలోనే రానుందట. (Twitter)
గతంలోనే స్పష్టం చేసిన మస్క్
ట్విట్టర్ పక్షి లోగో మాయమైపోతుందని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌లో ఈ విషయం తెలిపారు. సరికొత్తగా ఏర్పాటు చేసిన “ఎక్స్ కార్ప్” అనే సంస్థలో ట్విట్టర్‌ను విలీనం చేయనున్నట్లు చాలా కాలం కిందటే మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆయన.. త్వరలోనే తాము ట్విట్టర్ బ్రాండ్‌కు స్వస్తిపలుకుతామని చెప్పారు.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
క్రమంగా అన్ని బర్డ్స్‌కూ వీడ్కోలు చెప్పక తప్పదని స్పష్టం చేశారు ఎలన్ మస్క్. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే.. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుందంటూ మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ ట్విట్టర్‌ను గతేడాది కొనుగోలు చేసినప్పటి నుంచి ఉద్యోగుల తొలగింపు ఓ ఎత్తు అయితే ఇది అతి పెద్ద మార్పుగా నిలవనుంది.
Read Also : What Is Project K Movie : కల్కి 2898 AD.. ఈసారి హాలివుడ్ రేంజ్‌లో ప్రభాస్ దుమ్ము రేపుతాడా?
X అంటే పడిచచ్చేంత ఇష్టమట
ఎలన్ మస్క్‌కు X అనే అక్షరం అంటే పడిచచ్చేంత ఇష్టమట. ఈ విషయం అందరికీ తెలిసినదే. ట్విట్టర్ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా కంపెనీని ఎవ్రీ థింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె ముఖ్య భూమిక పోషిస్తుందని మస్క్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్‌లోని అన్ వెరిఫైడ్ ఖాతాల నుంచి ప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని లిమిటెడ్‌గా ఉంచుతున్నట్లు కూడా మస్క్ లేటెస్ట్‌గా ప్రకటించారు.
డైరెక్ట్ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. అన్‌వెరిఫైడ్ అకౌంట్ల నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్ మెసేజ్)లు చేయగలరని పేర్కొంది. వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మెసేజులు పెట్టుకోవాలంటూ ట్విట్టర్ సూచనలు చేసింది.
Read Also : ప్రపంచ కుబేరుల్లో ముఖేష్ అంబానీది ఎన్నో స్థానమంటే…