Mobile Phone: నేటి స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని మనిషి చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రతి ఒక్కరి చేతిలో ఓ సెల్‌ఫోన్, దానికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పక ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వచ్చి చాలా మందికి అదేపనిగా దాన్ని చూస్తూ ఉండిపోయే అలవాటు వచ్చేసింది. ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్ స్టా రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తుంటారు. తాజాగా తేలిన ఓ అధ్యయనంలో రోజుకు సగటున 80 సార్లు స్మార్ట్ ఫోన్ వైపు చూస్తుంటారని, నోటిఫికేషన్స్ చెక్ చేస్తుంటారని తేలింది. Mobile Phone
ఫోన్‌తో పని ఉన్నా, లేకున్నా ఏదో ఒకటి చూడటం చాలా మందికి అలవాటు అయిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేకుండా బతకడం కష్టంగా అయిపోయింది. ప్రస్తుతం దాదాపు 50 శాతం మంది అసలు తాము ఎందుకు ఎందుకు ఫోన్ తీస్తున్నామో కూడా తెలియకుండానే చేతుల్లోకి తీసుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింట్ ఫర్మ్ అయిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ వివరాలను ఇటీవల తెలిపింది. సగటున ఒక స్మార్ట్ ఫోన్ యూజర్ రోజులో 70 నుంచి 80 సార్లు స్మార్ట్ ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు వెల్లడైంది. భారతదేశంలోని సుమారు 1000 మంది స్మార్ట్ ఫోన్ యూజర్లను పరిగణలోకి తీసుకుంటే ఈ వివరాలు వెల్లడయ్యాయని తేలింది.
మిగతా 45 నుంచి 50 శాతం మంది మాత్రం తాము ఫోన్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నామన్న దానిపై క్లారిటీ ఉందట. ప్రస్తుతం టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా స్మార్ట్ ఫోన్‌లో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ వినియోం పెరిగింది. ఈ కారణంగా యూజర్లు ఫోన్‌తో గడిపే సమయం మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారత్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ యూజర్లలో 50 నుంచి 55 శాతం మంది యాప్స్‌ను ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్, జాబ్స్‌కు సంబంధించిన యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ఇవీ చదవండి: 300 Cell towers: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం సేవలు.. ఏపీలో 300 సెల్‌టవర్ల ప్రారంభం
5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..
Marta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు వ్యక్తులే!
Life partner name: మీ ఫోన్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ఎలా ఫీడ్ చేసుకున్నారు? ఇలా ప్రయత్నిస్తారా?
IB Syllabus in AP Schools: 45 వేల పాఠశాలల్లో ఐబీ కరిక్యూలమ్.. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతం
Phone beside Bed: బెడ్ పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?
Phone Charging: మీ ఫోన్‌లో చార్జింగ్ త్వరగా అయిపోతోందా? హ్యాకింగ్ బారిన పడుతున్నారా?
Life Partner: How do You choose the right life partner?
Mobile Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్ చేస్తున్నారట!!
Bitcoin: మళ్లీ బిట్ కాయిన్ హవా.. 2021 తర్వాత తొలిసారి $60,000కి చేరుకున్న బిట్‌కాయిన్ ధర
Alcohol: మందు తాగడం మానేస్తే శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయంటే..
