5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..

ప్రస్తుతం 5జీ ఫోన్లపై (5G Smartphone) చాలా మంది మక్కువ చూపుతున్నారు. తక్కువ బడ్జెట్‌లో 5జీ నెట్‌వర్క్ (5G Smartphone) సపోర్ట్ చేసే మంచి బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్ ఫోన్ల కోసం కొందరు వేచి చూస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. 15 వేల రూపాయల్లోపు 5జీ స్మార్ట్ ఫోన్లలో (5G Smartphone) మంచి బ్రాండ్లతో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ కామర్స్ వెబ్ సైట్లలో, యాప్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేయండి మరి..

రెడ్‌మీ 11 ప్రైమ్
ఈ స్మార్ట్ ఫోన్లో 6.58 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ మెన్సిటీ 700 ప్రాసెసర్ ఉన్నాయి. 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమొరీతో అందుబాటులో ఉంది. 50 ఎంపీ డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5,000 ఎంఏహెచ్‌తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,999.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14
సాధారణంగా శాంసంగ్ ఫోన్లలో కెమెరా క్వాలిటీ బాగుంటుంది. గెలాక్సీ ఎఫ్14 స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, 4 జీబీ/128 జీబీ మెమొరీ వేరియెంట్‌లో అందుబాటులో ఉంది. 50+2 ఎంపీ బ్యాక్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ మాత్రం 6,000 ఎంఏహెచ్ తో ఉంటుంది. దీని ధర రూ.14,490.

ఐక్యూ జెడ్ 6 లైట్
దీంట్లో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమొరీ, 50+2 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.13,999.

లావా బ్లేజ్
ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ మెన్సిటీ 700 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ /128 జీబీ మెమొరీ ఉంది. 50+2+బీజీఏ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ధర రూ.10,999.

రియల్ మీ 9
దీంట్లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ మెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీ, 48+2+2 ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ధర రూ.14,999.

పోకో ఎం4 ప్రో
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంది. 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమొరీ వేరియంట్‌లో అవైలబుల్ ఉంది. 50+8 ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్. ఫోన్ ధర రూ.14,999.

వివో టీ2ఎక్స్
దీంట్లో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ మెన్సిటీ 1300 ప్రాసెసర్ తో వస్తుంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమొరీ, 50+2 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. దీని బ్యాటరీ కెపాసిటీ 6000 ఎంఏహెచ్ తో వస్తుంది. ధర రూ.13,999.

రియల్ మీ 9ఐ
ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డిమెన్సిటీ 800 ప్రాసెసర్ ఉంటాయి. 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమొరీ వేరియంట్‌లో వస్తుంది. 50+2+2 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ధర రూ.14,999.

ఇన్ఫీనిక్స్ హాట్ 20
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ మెన్సిటీ 810 ప్రాసెసర్ ఉన్నాయి. 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమొరీ, 50 ఎంపీ + ఏఐ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. దీని ధర రూ.11,499.

Read Also : TRP Rating: టీఆర్పీ రేటింగ్‌లో దుమ్మురేపిన సినిమాలు ఇవే..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles