Daily Egg: రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. గుడ్డును రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం. ఉడికించిన గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. ఉడికించిన గుడ్లు మంచి పోషకాహారం. ఈ గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. Daily Egg
శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉడికించిన గుడ్డులో ఉంటాయని చెబుతున్నారు. రోజుకు ఒకటి ఉడికించిన గుడ్డు తింటే ఒక వారంలో మీ శరీరంలో మార్పులు కనిపించడం ఖాయం. గుడ్లలో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో వచ్చే అనేక వ్యాధులను వేగంగా మాన్పడంలో గుడ్డు దోహదకారిగా ఉంటుంది.
ఉడికించిన గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి మరియు రిబోఫ్లేవిన్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు బలాన్ని ఇస్తాయి. ఎముకలను పటిష్టంగా ఉంచడంలో ఉడికించిన గుడ్డుది కీలకపాత్ర. ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. శరీరాన్ని బలోపేతం చేయడంలో గుడ్లు బాగా హెల్ప్ అవుతాయి. శరీరంలోని కండరాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గుడ్డు తినాలి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
ఉడికించిన గుడ్డు తినడం వల్ల కంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. గుడ్లలో కెరోటినాయిడ్స్ లభిస్తాయి. పెరుగుతున్న వయసు వల్ల, ప్రజలు అనేక కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. గుడ్డులో జియాక్సంతిన్, లుటిన్ మూలకాలు కనిపిస్తాయి. ఉడికించిన గుడ్డును ఖాళీ కడుపుతో తినటం వల్ల లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. రోజంతా అలసట కారణంగా స్టామినా చాలా బలహీనంగా మారుతుందట.
మీ శరీరం దృఢంగా ఉండాలంటే రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటే శరీరానికి రెట్టింపు బలం చేకూరడంతో పాటు అనేక వ్యాధుల నుంచి కూడా శరీరం దూరంగా ఉంటుంది. శరీరం శక్తిని పెంచడంలో గుడ్డు దోహదం చేస్తుంది.
ఉడికించిన గుడ్డు శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కూడా దోహదం చేస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో ఉడికించిన గుడ్డు తినటం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. గుడ్డును అల్పాహారంగా తీసుకోవాలి. దీంతో పొట్ట భారంగా అనిపించడం ఆగిపోతుంది.
ఖాళీ కడుపుతో గుడ్లు తినడం ద్వారా, మీ మెదడు చాలా వేగంగా షార్ప్‌గా పని చేస్తుంది. గుడ్లలో ఉన్న పోషకాలు మెదడును త్వరగా పదును పెట్టడంలో ఉపయోగపడతాయి. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, సెలీనియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితనాన్ని మెరుగుపరుస్తాయి.
ఇవీ చదవండి: Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..
Egg Health: గుడ్డు తింటే ఆరోగ్యమా? కలిగే ప్రయోజనాలేంటంటే..
Chicken fry recipe: నోరూరించే చికెన్ ఫ్రై.. ఎలా తయారు చేసుకోవాలంటే.. అదిరిపోయే టేస్ట్ కోసం ఇలా చేయండి..
Morning breakfast: ఉదయం ఎలాంటి టిఫిన్ తింటే ఆరోగ్యకరం.. ఇలా ప్లాన్ చేసుకోండి..
Women Health Tips: మహిళల ఆరోగ్యానికి 5 సూత్రాలు.. ఆచరిస్తే అందమైన జీవితం!
