HomeInternationalFolding House: ధర రూ.21 లక్షలు.. అమెరికాలో ట్రెండింగ్‌లో ఉన్న మడత పెట్టే ఇళ్ల అమ్మకం

Folding House: ధర రూ.21 లక్షలు.. అమెరికాలో ట్రెండింగ్‌లో ఉన్న మడత పెట్టే ఇళ్ల అమ్మకం

Folding House: సొంతిల్లు కట్టుకోవడం చాలా మందికి చిరకాల స్వప్నం. మధ్య, దిగువ తరగతి ప్రజలకు ఎప్పటికీ నెరవేరలేని ఓ కల. అయితే, దాని కోసం కొందరు అలుపెరుగని కృషి చేసి సాధించుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టుకోవడం అనేది రకరకాలుగా ఉంటుంది. స్టాండర్డ్‌గా ఇల్లు ఉండాలంటే సంప్రదాయపద్ధతిలో కట్టుకుంటారు. కానీ, ఇప్పుడు ఓ కొత్త విధానం ట్రెండింగ్‌లో నడుస్తోంది. అదే మూవింగ్‌ హౌస్‌. వివిధ దేశాలతో పాటు మన దేశంలోనూ విస్తరిస్తోంది. 60-80 ఏళ్లపాటు మన్నిక వచ్చే ఈ ఇళ్లు.. ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్‌ చేసుకొనే వీలుంది. ఇప్పుడు అమెరికాలో కూడా మడతపెట్టే ఇళ్లు అమ్మకం జోరుగా సాగుతోంది. దీని ధర రూ.21 లక్షల పైమాటే అని చెబుతున్నారు. Folding House

అగ్రరాజ్యంలో హోల్డింగ్ హౌస్‌లను అమెజాన్‌లో సైతం విక్రయిస్తున్నారు. ఇటీవల కుర్చీ మడతపెట్టే సాంగ్‌ బాగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు సైతం ఈ డైలాగులు వాడేస్తున్నారు. మడత పెట్టే ఇళ్లు అమెరికాలో అందుబాటులోకి వచ్చాయి.

అనేక మంది చిన్న వయసు నుంచే తమకు ఫలానా ఇల్లు, ఫలానా మోడల్‌లో కావాలని, కట్టుకోవాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ కృషి చేస్తుంటారు. ఇప్పుడు మామూలు ఇళ్లను కట్టుకోవాలి లేదా కొనాలంటే చాలా కష్టతరమైన పని. ఎందుకంటే అవి లక్షల్లో ఉంటాయి.. ఇంకా బాగా కావాలంటే కోట్లు కూడా వెచ్చించాల్సి ఉంటుంది.

ఈ తరహా కష్టాల నుంచి గట్టేక్కేందుకు చాలా మంది పలు రకాలుగా ఇళ్లను నిర్మించుకుంటూ ఉంటారు. మనం నిత్యం ఇలాంటివి సోషల్‌ మీడియాలో, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో వార్తలుగా చూస్తుంటాం. అయితే ఇప్పుడు మడత పెట్టే ఇల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సామాజిక వేదికల్లో షేర్‌ చేశాడు. లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌టాక్‌లో పంచుకున్న ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఇంటి ధర అక్షరాల రూ. 21 లక్షలపైనే పలికిందట. ఆ ఇల్లు 16.5 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉంది. అందులోని ప్రత్యేకత ఏమిటంటే.. మడత పెట్టడం. ఈ చిన్న ఫ్లాట్లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్రూమ్ కూడా అందుబాటులో ఉంటాయి. బ్రయంట్ మాత్రమే కాదు..పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్సులకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఇలాంటి చిన్న ఇళ్లను అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలపై కొంటున్నారు. ఈ ఇంటి వీడియో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

https://www.news9live.com/videos/viral-videos/us-man-buys-dream-home-from-amazon-for-rs-21-lakh-watch-viral-video-2430549

Read also: Vastu Rules for house: ఏ అంతస్తులో ఇల్లు తీసుకోవాలి? ధన ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి?
Deepam: దీపారాధన వేళ ఇలా చేస్తే ఇల్లు శ్మశానమేనట.. ఆసక్తికర విషయాలివే..
World’s Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం.. అక్కడి ప్రజల సంతోషానికి కారణం ఏంటో తెలుసా?
IRR Scam: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్
Poverty in Andhra Pradesh: ఏపీలో పేదరికంపై గెలుస్తున్న పేదలు.. 4.19 శాతానికి తగ్గిన పేదరికం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు