HomeAndhra PradeshJournalist House Sites: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల దరఖాస్తులకు మరో వారం రోజుల గడువు పెంపు

Journalist House Sites: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల దరఖాస్తులకు మరో వారం రోజుల గడువు పెంపు

Journalist House Sites: ఏపీలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులకు మరో వారం రోజులు గడువు పొడిగించినట్లు సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయించామన్నారు. Journalist House Sites

ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ సోమవారం వరకు అర్హులైన జర్నలిస్టుల నుంచి వెబ్ సైట్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 6 జనవరి, 2024 వరకు అంటే నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోని వారికి మరియు నమోదు చేసుకున్నప్పటికీ సబ్మిట్ కొట్టని వారికి ఆయా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీ చేసిందని గుర్తుచేశారు. సంబంధిత జీవోలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే వారంతా http://www.ipr.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 26 ఫిబ్రవరి, 2024 వరకు నిర్ణీత గడువులోగా తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలను ప్రతి ఒక్క జర్నలిస్టు పొందాలని తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే జర్నలిస్టుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Journalist House Sites: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం.. మూడు రోజుల్లో బడ్జెట్‌ రిలీజ్‌!
Journalist Houses: జర్నలిస్టులకు సీఎం జగన్‌ తీపికబురు.. అక్రిడేషన్‌ కలిగిన అందరికీ 3 సెంట్ల స్థలం
AI Anchor: అదరగొడుతున్న ఏఐ యాంకరమ్మ.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టిందా?
Journalist Health Camp: బెజవాడలో జర్నలిస్టులకు ఉచిత హెల్త్ క్యాంప్‌..
YS Jagan at INDIA Today Education Summit: కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైయస్‌ జగన్‌.. ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో కీలక అంశాల ప్రస్తావన
Taekwondo awards: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “తైక్వాండో”లో ఏపీ బృందానికి పతకాలు
YSR Awards: ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు.. వైఎస్సార్ అవార్డుల ప్రదానంలో సీఎం జగన్
TV9 NTV Reporters Fight: మహిళా రిపోర్టర్ల మాటల యుద్ధం.. నంబర్‌ 1 ప్లేస్‌ కోసం రగడ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు