TV9 NTV Reporters Fight: ఏపీలో రాజకీయం గరం గరంగా సాగుతున్న వేళ.. ఇప్పుడు సందిట్లో సడేమియా అన్నట్లుగా ఇద్దరు మహిళా రిపోర్టర్లు డిష్యుం డిష్యుం అని నంబర్ వన్ ప్లేస్ కోసం ఆరాట పడటం కలకలం రేపుతోంది. ఆ రిపోర్టర్లు ఇద్దరూ రెండు తెలుగు టాప్ ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లకు చెందిన వారు కావడంతో ఇప్పుడు మీడియా సర్కిళ్లలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అందులో ఒక చానల్‌లో పని చేస్తున్న మహిళా రిపోర్టర్ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు. రెండో చానల్‌లో పని చేస్తున్న ఆమె కూడా తక్కువేం కాదు.. ఆవిడదీ సుదీర్ఘ ప్రస్థానమే. ఇటీవల కాలంలో నువ్వా-నేనా అన్నట్లుగా వీరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోందని టాక్ వినిపిస్తోంది. (TV9 NTV Reporters Fight)
ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండే ఈ ఇద్దరు జర్నలిస్టుల్లో ఒకరు ఎన్‌టీవీ ప్రతినిధి రెహానా కాగా, మరొకరు టీవీ9 ప్రతినిధి హసీనా. వీరిద్దరూ కొంత కాలంగా విజయవాడలో ఉంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలతో పోటాపోటీగా ఇంటర్వ్యూలు తీసుకుంటూ తామే నంబర్ వన్ అని చెప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే, వీరి మధ్య వాగ్వాదానికి కారణం.. కెమెరాలు, టీవీ గొట్టాలే అని తెలుస్తోంది. ఒకరు కవరేజీ ఇస్తుండగా మరొకరు వచ్చి మైకు పెట్టేసి బైట్లు, ఇంటర్వ్యూలు తీసుకోవడంతో అసలు సమస్య వచ్చినట్లుంది.
ఈ క్రమంలో చిర్రెత్తుకొచ్చిన టీవీ9 రిపోర్టర్ హసీనా.. ఎన్టీవీ ప్రతినిధి రెహానాపై మాటల యుద్ధం మొదలు పెట్టేసింది. ఇదంతా వీడియో తీసిన రెహానా.. సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు మీడియా సర్కిళ్లలోనూ, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వైరల్ అయిపోయింది. ఆడాళ్లా మజాకా… అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానం కోసం టీవీ9, ఎన్టీవీ మధ్య ఓ రేంజ్‌లో పోటీ కొనసాగుతోంది. ఒకరిని మించి మరొకరు తమదే తొలి స్థానమని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఎన్టీవీ నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఇటీవలే ఆ స్థానాన్ని టీవీ9 ఆక్రమించింది. ఈ మేరకు పెద్ద ఎత్తున టీవీ9 స్టూడియోలో సంబరాలు కూడా చేసుకున్నారు. రజనీకాంత్ కేక్ కట్ చేసి సహచర ఉద్యోగులకు తినిపించారు. అయితే, కొన్ని రోజులకే మళ్లీ తామే నంబర్ వన్ అని ఎన్టీవీ ప్రకటించుకుంది.
ఇలా నంబర్ వన్ ప్లేస్ కోసం రెండు చానళ్ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో కవరేజీ విషయంలో ఎవరూ తగ్గట్లేదు. ఏపీలో ఫోకస్‌గా ఉండే అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలతో ఇంటర్వ్యూలు, బైట్లు ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తున్నారు. అటు ఎన్టీవీ, ఇటు టీవీ9 రెండింటిదీ ఇదే పరిస్థితి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి అంబటి రాంబాబు, టీడీపీకి చెందిన బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి నేతలతో ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకెళ్తుంటాయి రెండు చానళ్లు.
సరిగ్గా ఇక్కడే రిపోర్టర్ల మధ్య వాగ్వాదానికి కారణం అయ్యింది. ఉదాహరణకు యాజమాన్యం నుంచి అర్జెంటుగా కాల్ వచ్చి కొడాలి నాని బైట్ కావాలి అని చెబితే… పరుగో పరుగు. వెంటనే కొడాలి నాని వద్దకు మైక్, కెమెరామెన్, రిపోర్టర్ వెళ్లిపోతారు. సరిగ్గా ఇదే క్రమంలో అవతలివైపు చానల్ వాళ్లు కూడా ఇదే చేశారనుకోండి.. ఇద్దరు రిపోర్టర్లు, కెమెరామెన్లు, గొట్టాలు.. ఏక కాలంలో కొడాలి నాని ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, నంబర్ వన్ ప్లేస్ ఎందుకు ఇంక…? తమదే ఎక్స్‌క్లూజివ్‌గా ఉండాలనే ఆదేశాలతో తానే ముందు తీసుకుంటా అని, లేదు లేదు.. తానే ముందు బైట్ తీసుకుంటా అనే వాదన తెరపైకి వస్తుంది. ఎన్టీవీ, టీవీ9 ప్రతినిధులు రెహానా, హసీనా మధ్య కూడా అచ్చం ఇదే జరిగింది. అందుకే ఇద్దరూ వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ వీడియోలో ఏం ఉందో మీరూ చూసేయండి…
Read Also : YS Jagan Review: అటువైపు యుద్ధం మొదలైపోయింది… “వై ఏపీ నీడ్స్ జగన్”పై శ్రేణులను సన్నద్ధం చేస్తున్న సీఎం!