YS Jagan Siddham Sabha: మరో రెండు నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమోనన్నారు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా? అని కార్యకర్తలను, కేడర్‌ను ప్రశ్నించారు. YS Jagan Siddham Sabha
* వారి మీడియా, వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. దానికి మీరంతా సిద్ధమేనా?
* వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా?
* మీ అందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్‌ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. సెల్ టార్చర్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా.. సిద్ధమే అని చెప్పండి.
* ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకం,
సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా? అని అడుగుతున్నా.
* ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు ఇప్పటికే 75. ఆయన వయసు 80కి పోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవు.
*ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారు.
* మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం.
* ఇంత మంది ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడు.
* కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంత మంది తోడేళ్లు ఏకం అవుతున్నారు.
* అందుకే ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒకడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, రైతన్న కూడా మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది.
* పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి.
* పేదవాడి భవిష్యత్ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10-15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయేఎన్నికలు అత్యంత కీలకం.
* పేదవాడి ప్రతి గుండె ఏకం కావాలి. పెత్తందార్ల పార్టీలను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి రావాలి.
* దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
read also; Jagan Siddam: మీ జగన్ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..
