YS Jagan in Rapthadu: మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, వాలంటీర్‌కు, ఒక్క విషయం చెబుతున్నా.. ఇది మీ అందరి పార్టీ.. అని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది.. అని వివరించారు. YS Jagan in Rapthadu
* మార్కెట్ యార్డులు, దేవాదాయ బోర్డులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులివ్వడం కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.
* గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అనే వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మన ప్రభుత్వం మనలో నుంచి చదువుకున్న మన పిల్లలతో తీసుకొచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా ప్రజల మన్ననలు పొందుతోంది. మనతోపాటు పని చేస్తోంది.
* మన వారికి చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం.
* నామినేషన్ మీద ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో ఇదే పంథా న్యాయం చేశాం.
* జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* మంచి పాలన అందించాం. భవిష్యత్‌లో మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికోసం నిలబడినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు.
* మంచి పాలనలో భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ పదవులిచ్చే పార్టీ మన వైయస్సార్‌సీపీ.
* ప్రతి కార్యకర్తకూ మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నా.
* ప్రతి కార్యకర్తకూ, ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు అవకాశం కల్పించే బాధ్యత నాదీ.
* ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు పరిపాలన కూడా చూశారు. ఎలాంటి నాయకుడు మీకు కావాలి?
* చంద్రబాబు మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టోలు చూపి రైతన్నలను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలనే దిక్కుమాలిన ఆలోచన చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందర్నీ మోసం చేస్తున్న అలాంటి చంద్రబాబు మాదిరిగా ఉండాలా?
* నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అని రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు.
* ఈరోజు అలా చేయగలిగాం కాబట్టే, ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలు నెరవేర్చా కాబట్టే ప్రతి ఇంటికీ వెళ్లి అక్కా మీరే టిక్ పెట్టండి, ఎన్నెన్ని జరిగాయో, 99 శాతం మా అన్న నెరవేర్చాడని ప్రతి కార్యకర్త ప్రతి పేద వాడి ఇంటికి వెళ్లగలుగుతున్నాడు. ఇదీ నాయకుడు అంటే.
* నాయకుడంటే ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు మాటిచ్చాడు అంటే చేస్తాడంతే అనే పరిస్థితి ఉండాలి.
* ప్రతి కార్యకర్తకూ ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు మాకు అండగా తోడుగా ఉండాలి అనేలా ఉండాలి.
* ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ, ప్రతి పేద కుటుంబానికీ, ప్రతి పేదకు, వారి భవిష్యత్‌కు అండగా నిలబడగలిగాం. మాట ఇచ్చాం. నెరవేర్చాం. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లగలిగే పరిస్థితి మనకు, మన వైయస్సార్‌సీపీకి ఉంది.
* అందుకే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్… 175కు 175 అని అడుగుతున్నా. మన టార్గెట్ 25కు 25 ఎంపీలు అని అడుగుతున్నా.
* పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలే లేదు.
* ఇదీ 350 వాగ్దానాలిచ్చి అందులో 10 శాతం కూడా అమలు చేయని చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు ప్రభుత్వం కాదు.. ఇదీ… ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసి మరీ ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు కోరుతున్న మన వైయస్సార్‌సీపీ పార్టీ.
* అటు టీడీపీ, ఇటు వైయస్సార్‌సీపీ, అటు పెత్తందార్లు, ఇటు పేదవాడు.
* పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా.
read also: Jagan Siddam: మీ జగన్ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..
