HomeLife StyleTFM Value Soaps According to BIS: మీరు వాడే సబ్బు అసలైనదేనా? TFM Value...

TFM Value Soaps According to BIS: మీరు వాడే సబ్బు అసలైనదేనా? TFM Value ఇలా చెక్ చేయండి

TFM Value Soaps According to BIS: భారతదేశంలో చాలా మంది స్నానానికి వాడే సబ్బుల స్థానంలో టాయిలెట్‌ సబ్బులు వాడుతున్నారని మీకు తెలుసా? సబ్బుల్లో ఎన్ని రకాలు ఉంటాయి. ఎలాంటి సబ్బులు వాడితే మంచిది. ఏవి ప్రమాదకరమైనవి.. ఇత్యాది ఆసక్తికర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. TFM value Soaps

స్నానం ఆచరించిన తర్వాత మన స్కిన్‌ రఫ్‌గా మారిపోవడం, వైట్‌ కలర్‌ రావడం, గీతలు పడటం లాంటివి గమనిస్తుంటాం. ఇదంతా మనం వాడుతున్న సబ్బుల వల్లే జరుగుతుంది. ఎలాంటి సబ్బుతో స్నానం చేస్తే శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలి. సబ్బుల్లో మూడు రకాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి..

1. టీఎఫ్‌ఎం వ్యాల్యూ 76 శాతం కంటే ఎక్కువ ఉన్నవి. ఇవి చాలా మంచి సబ్బులు. నాణ్యమైనవి.
2. టీఎఫ్‌ఎం వ్యాల్యూ 70 శాతం, అంతకంటే ఎక్కువ కలిగినవి. ఇవి గుడ్‌ క్వాలిటీ.
3. టీఎఫ్‌ఎం వ్యాల్యూ 60 శాతం, ఆపైన ఉండేవి. ఇవి మీడియం క్వాలిటీ కింద లెక్కగడతారు.

టీఎఫ్‌ఎం అంటే టోటల్‌ ఫ్యాటీ మ్యాటర్‌. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రమాణాల ప్రకారం.. టీఎఫ్‌ఎం వ్యాల్యూ 76 శాతం, అంతకన్నా ఎక్కువ ఉన్న సబ్బులను మాత్రమే స్నానం చేయడానికి వినియోగించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతి సబ్బు వెనుక ఆ సబ్బుకు కలిగిన టీఎఫ్‌ఎం వ్యాల్యూ ముద్రించి ఉంటారు. ఇది తప్పకుండా అందరూ చూసి సబ్బులను కొనుగోలు చేయాలి. పైన పేర్కొన్న విధంగా గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3 సబ్బులు స్నానానికి పనికి రావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సబ్బుల్లో టీఎఫ్‌ఎం వ్యాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే మన చర్మం అంత మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైగా మారిపోవడం, గీతలు పడటం, తెల్లగా మారడం లాంటివి జరగవని చెబుతున్నారు.

సబ్బులు, వాటి టీఎఫ్‌ఎం వ్యాల్యూలు ఈ విధంగా ఉన్నాయి..

* మైసూర్‌ శాండిల్‌ సోప్: టీఎఫ్‌ఎం వ్యాల్యూ 80 శాతం
* సింతాల్‌: 79 శాతం
* సుపీరియా సిల్క్‌ సోప్: 76 శాతం
* పార్క్‌ అవెన్యూ: 76 శాతం
* గోద్రేజ్‌ నంబర్‌ వన్: 76 శాతం
* గోద్రేజ్‌ ఫెయిర్‌ గ్లో: 76 శాతం
* సంతూర్‌: 75 శాతం.
* వివెల్‌: 73 శాతం
* మాంగో: 71 శాతం
* లక్స్‌: 70 శాతం
* హమామ్‌: 68 శాతం
* మెడిమిక్స్‌: 60 శాతం
* లైఫ్‌ బాయ్‌: 60 శాతం

మరి మీరు వీటిలో ఎలాంటి సోపులు వాడుతున్నారో, ఎలాంటి వాటితో స్నానం చేస్తున్నారో ఓసారి చెక్‌ చేసుకోండి. హ్యాండ్‌ వాష్‌, టాయిలెట్‌ క్లీనింగ్‌ కోసం తయారు చేసిన సోపులు స్నానానికి వాడుతున్నారా? అయితే వెంటనే జాగ్రత్త వహించి.. మైసూర్‌ శాండిల్‌ సోపు లాంటి టీఎఫ్‌ఎం వ్యాల్యూ అధికంగా ఉన్న సోపులను మాత్రమే వాడండి.

ఇదీ చదవండి: Night bath: రాత్రిపూట స్నానం చేయడం వల్ల ప్రయోజనాలివే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు