రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయం పూట స్నానం చేస్తుంటారు. అయితే, రాత్రి స్నానంతో (Night bath) కూడా చక్కటి ప్రయోజనాలు ఉన్నాయట. అధిక రక్తపోటుతో బాధపడేవారు రాత్రి పూట తలస్నానం చేస్తే (Night bath) రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట గోరు వెచ్చని నీటితో స్నానం (Night bath) చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.
1. పగలంతా కష్టపడినా రాత్రి పూట గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం అలసట తీరుతుంది. సుఖమైన నిద్ర పట్టడానికి మార్గం సుగమనం అవుతుంది.
2. రాత్రి పూట నిద్రలేమి, అలసట లాంటి సమస్యలున్న వారు ఇలా ట్రై చేసి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల చర్మ సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు.
3. ఇలా అత్యంత వేడి నీళ్లు, చల్లటి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
4. మొటిమల సమస్య ఉన్న వారు రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. చర్మం సహజంగా కాంతి వంతంగా తయారవుతుంది. రాత్రి స్నానం అనంతరం చర్మంపై మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకొని పడుకోవాలి.
6. దాంతో పాటు బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోకి వస్తున్నప్పుడు చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి. ఇలా చేస్తే మొహం కాంతి వంతంగా తయారవుతుంది.
7. ఉదయం స్నానం చేసేటప్పుడు సాధారణంగా చల్లటి నీళ్లతోగానీ, వేడి నీళ్లతోగానీ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అయితే, చర్మానికి హాని కలిగించేంత వేడి నీళ్లు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
8. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందంటున్నారు. శరీరం తట్టుకోగలిగినంత నీటి ఉష్ణోగ్రతను పాటించాలి.
రిలేషన్ షిప్ లో థ్రిల్లింగ్ కావాలా? ఇవి ప్రయత్నించండి..
మీరు రిలేషన్ షిప్ లో ఉంటే కొన్ని మార్గాలు అనుసరించాలి. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఆనందంగా గడపాలంటే అనుసరించాల్సిన మార్గాలు కొన్ని ఉన్నాయి. మంచి పద్ధతులు అవలంభించడం ద్వారా బంధాన్ని సుదీర్ఘ కాలం పాటు సంతోషంగా కొనసాగించేందుకు వీలవుతుంది. అలాంటి విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.
1. బంధంలో మీ భాగస్వామిపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలి. ఏ సమయంలోనూ నమ్మకాన్ని సడలేలా చేసుకోరాదు. తద్వారా అనుమానాలకు తావు లేకుండా సంతోషంగా బంధాన్ని కొనసాగించగలుగుతారు.
2. విశ్వాసం ఉంటే ఏ బంధమైనా శాశ్వతంగా నిలిచి తీరుతుంది. రిలేషన్ షిప్ దెబ్బతినేది అనుమానాలు మొదలైనప్పుడే.
3. అలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూసుకోవాలి. అనుమానం అనే బీజం పడితే ఎలాంటి బలమైన బంధమైనా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది.
4. రిలేషన్ షిప్ లో ఉన్నవారు అప్పుడప్పుడు మీ పార్ట్నర్ నుంచి కాస్త దూరంగా ఉండాలి. ఇలాంటప్పుడే మీ బంధం ఎలా కొనసాగుతోందో, మిమ్మల్ని భాగస్వామి ఎంతలా మిస్ అవుతున్నారో తెలుసుకోవచ్చు.
5. మీ మధ్య లోటుపాట్లు, ఇద్దరి మధ్య సమస్యలు తెలుస్తాయి. ఇద్దరి మధ్య పెనవేసుకున్న బంధం వ్యాల్యూ తెలియాలంటే ఒకరిని మరొకరు మిస్ అవుతూ ఉండాలి.
6. అపార్థాలు తొలగిపోవాలంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉంటే ఇది సులువవుతుంది. ఇద్దరి మధ్య ఉన్న అవగాహనను బట్టి అపార్థాలను తొలగించుకోవచ్చు.
7. ఒకరిని మరొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మానసికంగా ఎదుగుదలతోపాటు బంధం దృఢంగా మారుతుంది. ఒకరి బలహీనతను మరొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. సపోర్ట్ చేస్తూ ఉండాలి.
8. ఏవైనా పొరపాట్లు చేసినప్పుడు సారీ చెబుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. నిజాయితీ పెరుగుతుంది.
Read Also : Love Tips : అబ్బాయిలూ.. గర్ల్స్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?