HomeLife StyleEgg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..

Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..

Egg benefits: మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఓ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్డును అనేక రకాలుగా చేసుకొని తినొచ్చు. కొందరు పచ్చి గుడ్డునే తాగేస్తుంటారు. మరి కొందరు గుడ్డును ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఇక ఎగ్‌ ఫ్రై, ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్, ఎగ్‌ మంచూరియా, ఎగ్‌ కర్రీ.. ఇలా రకరకాలుగా చేసుకొని ఆరగిస్తుంటారు. Egg benefits

గుడ్డును పోషకాహారంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రమోట్‌ చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్‌వాడీల్లో గుడ్లను అందిస్తాయి. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో గుడ్డును భాగంగా చేస్తున్నాయి. గుడ్డులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంతేనా.. గుడ్డుపైన ఉన్న పెంకుల్లోనూ పోషకాలు ఉన్నాయట. ఇది చాలా మందికి తెలియని విషయం. గుడ్డు పెంకులు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓ పది పాయింట్లలో తెలుసుకుందామా..?

1. మనకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలంటే.. ప్రతి రోజూ గుడ్డు తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

2. సమతుల ఆహారాన్ని అందించడంలో గుడ్డుది ఎనలేని పాత్ర ఉంది.

3. గుడ్డులో ఉండే తెల్లసొన, పచ్చసొనలో మన శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు, ఖనిజాలు అందుబాటులో ఉంటాయి.

4. గుడ్లు అందరూ తింటారు కానీ గుడ్డు పెంకులను ఎవరూ తినేందుకు ఇష్టపడరు. కానీ, వాటిని కూడా అప్పుడప్పుడు తినాలంటున్నారు నిపుణులు.

5. కోడిగుడ్డులో ఎలాగైతే పోషకాలుంటాయో… గుడ్డు పెంకుల్లోనూ అదేరకంగా పోషకాలు ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

6. గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

7. ఒక గుడ్డు పెంకులో సగం తిన్నా కూడా మన శరీరానికి కావలసిన రోజువారీ క్యాల్షియం పూర్తి స్థాయిలో లభిస్తుందంటున్నారు.

8. గుడ్డు పెంకులో లభించే కాల్షియం కార్బోనేట్ వల్ల మన శరీరంలో ఉండే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

9. పెంకులో మెగ్నీషియం, ఫ్లోరైడ్ వంటి ఇతర ఖనిజాలు కూడా అందుబాటులో ఉంటాయి.

10. ఆస్టియోపోరొసిస్ వంటి ఎముకలను బలహీనపరిచే జబ్బుల నుంచి గుడ్డు పెంకులు కాపాడతాయని డాక్టర్లు సైతం స్పష్టీకరిస్తున్నారు.

ఇదీ చదవండి: Chicken fry recipe: నోరూరించే చికెన్‌ ఫ్రై.. ఎలా తయారు చేసుకోవాలంటే.. అదిరిపోయే టేస్ట్‌ కోసం ఇలా చేయండి..
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Peas: వేయించిన శనగలు.. మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం.. ప్రోటీన్స్ సమ్మిళితం
Pasupu Kommulu: పసుపు కొమ్ముల ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో తెలుసా?
Beetroot: బీట్‌రూట్‌తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఏయే విటమిన్లు ఉంటాయంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు