HomeAndhra PradeshYS Jagan on Social Justice: సామాజిక న్యాయానికి బ్రాండ్‌ వైయస్సార్‌సీపీ.. 68 శాతం మంత్రి...

YS Jagan on Social Justice: సామాజిక న్యాయానికి బ్రాండ్‌ వైయస్సార్‌సీపీ.. 68 శాతం మంత్రి పదవులిచ్చామన్న సీఎం జగన్‌

YS Jagan on Social Justice: రాష్ట్రంలో జరిగిన సామాజిక న్యాయంపై భీమిలి బహిరంగ సభలో సీఎం జగన్‌ పూసగుచ్చినట్లు తెలిపారు. సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం, చంద్రబాబు ఏం చేశాడన్నది చూద్దాం.. పేద సామాజికవర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు.. కేబినెట్ లో ఏకంగా 68 శాతం మంత్రిపదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ గా ఒక బీసీని చేశామన్నారు. (YS Jagan on Social Justice)

* కౌన్సిల్ చైర్మన్ గా ఎస్సీ. డిప్యూటీ చైర్ పర్సన్ గా నా అక్క ఒక మైనార్టీ.
* ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారిని గుండెల్లో పెట్టుకోవడం జరిగింది.
* గుడి చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా కనిపిస్తున్నారు నా అన్నదమ్ములు.
* ఆ ప్రేమ.. గుండెల నిండా ఉంది కాబట్టే మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాలా 2.13 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం.
* స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ లో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం 2.13 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలిచ్చాడు.
* ఈ ఉద్యోగాల్లో ఏకంగా 80 శాతం నానానానా అని పిలుచుకొని నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే అక్కడ ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నా.

* ఏకంగా రూ.2.53 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.
* ఏకంగా 75 శాతానికి పైగా నానానానా అని పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లింది.
* ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే అట్టడుగున ఉన్న వారికి అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పని చేసిపెడుతున్నారు.
* పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉంది?
* ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతాడు. ఇలాంటి వ్యాఖ్యలు వస్తే గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా?

* బీసీల తోకలు కత్తిరిస్తానని మాట్లాడితే, ఆ బీసీలను గ్రామాల్లో ఎవరైనా పట్టించుకుంటారా? ఆలోచన చేయాలని అడుగుతున్నా. ఎక్కడ ఉంది.. పేద సామాజికవర్గాలపై ప్రేమ చంద్రబాబుకు?
* ఎక్కడ చూసినా కూడా కనిపించేది.. ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కూడా కనిపించేది, ఏ పేదవాడి గుండెల నిండా ప్రేమగా కనిపించేది వైయస్సార్ సీపీ, జగన్ మార్క్ కనిపిస్తుంది ప్రతి పేదవాడి గుండెల్లోనూ.
* అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో.. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజుదేశంతో మనం పోటీ పడుతున్నాం.

* అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన అక్కగా, తమ్ముడిగా సంతోషాలను చూడాలని అక్కచెల్లెమ్మల కోసం ఎప్పుడూ జరగని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత.

* ఉండటానికి గూడు ఉండాలి, లక్షాధికారి కావాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికీ మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
* 2014లో ఎన్నికల ప్రణాళికలో చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 14205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.
* 2014 ఎన్నికల ప్రణాళికలో ఏటా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తామని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.
* బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు.

* సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయడం, దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది.
* ఇళ్ల పట్టాలు ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం.
* నేను చెప్పిన ఇవన్నీ కూడా 2014లో చంద్రబాబు తాను చేస్తానని చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి, ఎన్నికలప్పుడు ఊదరగొడుతూ ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు.

read also: YS Jagan on Development: మీ జగన్‌ ఏం చేశాడంటే.. ప్రతి గ్రామంలో మార్పులు కనిపిస్తాయన్న జగన్‌
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు