HomeCinemaID cards for Artists: కళాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

ID cards for Artists: కళాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

ID cards for Artists: కళాకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టిస్టులకు గుర్తింపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పోసాని కృష్ణమురళిని నియమించిన ఏపీ సర్కార్‌.. కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చొరవ చూపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం నిలిపేసిన నంది అవార్డులను పునరుద్ధరించింది. సాంస్కృతిక, పర్యాటక శాఖను మరింత బలోపేతం చేస్తోంది. తాజాగా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (ID cards for Artists)

అర్హులైన కళాకారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్. కె. రోజా ఈ నెల 20వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

కళాకారుల గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటవరకు నిర్వహించనున్నారు. సంబంధిత కళాకారులందరూ ఈ కార్యక్రమానికి హాజరై గుర్తింపు కార్డులను పొందాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యాటక, సాంస్కృతిక శాఖ) డా. రజత్ భార్గవ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించేందుకు ఇటీవల నంది నాటకోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక అవార్డులు, ప్రశంసా పత్రాలతో ప్రభుత్వం సత్కరిస్తోంది. అలాగే నాటకోత్సవాల్లో పాల్గొన్న వారికి సైతం జ్ఞాపికలు అందజేస్తూ వారికి తగిన గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

read also: Nandi Natakotsavalu: ఏపీలో నంది నాటకోత్సవాల సందడి.. డిసెంబర్‌ 23 నుంచి 29 వరకు..

Parliament session: వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయంపై కేంద్రం కీలక ప్రకటన

Sahiti Awards: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సాహితీమూర్తులకు పురస్కారాలు.. అనంతపురంలో 9న సదస్సు

YSR Awards: ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు.. వైఎస్సార్ అవార్డుల ప్రదానంలో సీఎం జగన్

NABARD: చేతివృత్తులకు, హస్తకళలకు నాబార్డు చేయూత

Nandi Awards: నంది అవార్డులపై ఏపీ సర్కార్‌ కీలక ముందడుగు.. 5 విభాగాల్లో అవార్డులు

Telangana Formation Day: ఎవరిది పైచేయి? దశాబ్ది ఉత్సవాల వేళ.. హీటెక్కిన తెలంగాణ రాజకీయం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు